శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జలపాతాల సందడి, క్యూ కడుతున్న ప్రకృతి ప్రేమికులు

www.mannamweb.com


నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జలపాతాలు సందడి చేస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు కొండల్లో ప్రవాహాలు పరుగులు పెడుతున్నాయి. ఈ ప్రకృతి సోయగాలు చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జలపాతాలు సందడి చేస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు కొండల్లో ప్రవాహాలు పరుగులు పెడుతున్నాయి.

నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రకృతి పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తుంది. కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలను చూసేందుకు పర్యాటకులు క్యూకడుతున్నారు.

నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల కొండల్లో విస్తరించి ఉంది. ఇది 1983 లో టైగర్ రిజర్వ్ హోదాను పొందింది. కోర్, బఫర్‌తో సహా ఈ ఫారెస్ట్ మొత్తం వైశాల్యం 3727.82 చదరపు కిలో మీటర్లు. ఇది భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్.

నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏపీలోని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇందులో రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణుల అభయారణ్యం ఈ టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉంటాయి.

ఈ టైగర్ రిజర్వ్ గుండా దాదాపు 270 కిలో మీటర్ల కృష్ణా నది ప్రవహిస్తుంది. శ్రీశైలం కొండల్లో వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ చూస్తే మనసు పులకరించిపోతుంది. వర్షాకాలంలో ఈ దృశ్యాలు మరింత సుందరంగా ఉంటాయి

ఇక్కడకు ఎలా చేరుకోవాలంటే – హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ 200 కి.మీ రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ఎయిర్ రూట్ : సమీప విమానాశ్రయం – రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ – 190 కి.మీ దూరంఎన్టీఆర్ అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ – 238 కి.మీ దూరం

శ్రీశైలం డ్యామ్