దసరా సందర్భంగా అబ్బురపరుస్తోన్న సూక్ష్మ కళాకారుడి ప్రతిభ.. పెన్సిల్‌పై నవ దుర్గలు

www.mannamweb.com


జగన్మాత మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు భీకరంగా యుద్ధం చేసి ఆ రాక్షసుడిని వధించి విజయం సాధించింది. ఈ సందర్భంగా 10 వరోజు ప్రజలంతా సంతోషంగా దసరా పండుగ జరుపుకుంటున్నారు. అందుకే ఈ పండుగను ఈ విజయదశమి అని అంటారు. అమ్మ వారిని తొమ్మిది రోజులు ఒక్కొక్క అవతారంతో అలంకరణ చేసి పూజిస్తారు. అందుకే దేవి నవరాత్రులు అని అంటారు. తాను వేసిన ఈ చిత్రంలో అమ్మవారిని తొమ్మిది రూపాలతో చూపించినట్లు పేర్కొన్నాడు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు దసరా నవరాత్రలు పురష్కరించుకొని పెన్సిల్ పై గీసిన 9 అవతారాల జగన్మాత చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఒక చిన్న కలర్ పెన్సిల్ పై చుట్టూ మూడువైపుల 9 రూపాలతో అమ్మవారి సూక్ష్మ చిత్రాలను మైక్రోపెన్ను తో వేసారు. ఈ చిత్రాలను కేవలం 30 నిమిషాల వ్యవధి లోనే వేసి అబ్బుర పరిచారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ జగన్మాత మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు భీకరంగా యుద్ధం చేసి ఆ రాక్షసుడిని వధించి విజయం సాధించింది. ఈ సందర్భంగా 10 వరోజు ప్రజలంతా సంతోషంగా దసరా పండుగ జరుపుకుంటున్నారు.

అందుకే ఈ పండుగను ఈ విజయదశమి అని అంటారు. అమ్మ వారిని తొమ్మిది రోజులు ఒక్కొక్క అవతారంతో అలంకరణ చేసి పూజిస్తారు. అందుకే దేవి నవరాత్రులు అని అంటారు. తాను వేసిన ఈ చిత్రంలో అమ్మవారిని తొమ్మిది రూపాలతో చూపించినట్లు పేర్కొన్నాడు. శైలపుత్రి దేవి, బాలత్రిపుర సుందరి, కుష్మాండదేవి, బ్రహ్మచారిణి, స్కంద మాత కాత్యాయిని, భద్రకాళి, దుర్గాదేవి, మహిషాసుర మర్ధిని వంటి చిత్రాలు చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. ఈ దసరా సందర్భంగా ప్రతి ఒక్కరిపై ఆ జగన్మాత ఆశీస్సులు వుండాలిని కోరుకుంటున్నానని చెప్పారు. దసరా రానున్న సందర్భంలో అందరికే దసరా శుభాకాంక్షలు చెప్పారు.