స్థానిక విశ్వం ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషనన్స్ నిర్వహించిన నవోదయ-2026 మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు విశేష స్పందన లభించింది.
త్వరలో నిర్వహించనున్న నవోదయ-2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మో డల్ పరీక్షను స్థానిక విశ్వం స్కూల్‌లో గురువారం నిర్వహించారు. నవోదయ ప్రవేశపరీక్ష నమూనా లోనే రూపొందించిన ఈ పరీక్షకు మొత్తం 347 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్. విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థి ముందుండాలంటే చిన్న వయసులోనే పోటీపరీక్షలకు సిద్ధం కావాలన్నారు. చిన్న వయసులోనే శాసీ్త్రయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడంతోనే జాతీయస్థాయి పరీక్ష ల్లో విజయాలు సాధ్యమవుతాయన్నారు. విశ్వం విద్యార్థులు నవోదయ- 2025 ప్రవేశ పరీక్షలో సాధించిన 69 సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏ సంస్థకీ లేని అసాధారణ రికార్డు అన్నారు. వివరాలకు 8688888802/ 9399976999 నంబరు, వరదరాజనగర్‌లోని వి శ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.


































