ముగ్గుర్ని మార్చేసి..జీవితాలు నాశనం చేసి. చెప్పేది నీతిసూక్తులు.చేసేది నీతిమాలిన పనులు

www.mannamweb.com


విలువలకు కేరాఫ్ అడ్రస్ అంటుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటే పతిత్తు లేరనేలా…నీతి వ్యాఖ్యాలు వల్లిస్తుంది. అభిమానులు, ప్రజలకు సుద్ధపూస కబుర్లు చెప్తుంది.

కెరీర్ లో ఎదగడానికి ఎంతకైనా దిగజారింది. చీరలు మార్చినట్లు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేసింది. ఇండస్ట్రీలో ఎదిగే కొద్దీ…మోనార్క్ లా…ఇంకా చెప్పాలంటే డాన్ లా వ్యవహరించింది. ఇంత ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ? ఈ స్టోరీని చూసేయండి.

నయనతార…అసలు పేరు డయానా మరియం కురియన్. 1984 నవంబరు 18న జన్మించింది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసింది. అదే సమయంలో కైరాలీ ఛానల్ లో…3 వేల జీతానికి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. సినిమా రంగంలో స్థిర పడేందుకు ఎన్ని అడ్డదారులు తొక్కాలో…అన్ని తొక్కింది. అవకాశాల కోసం ఎన్ని వేషాలో వేయాలో…అన్ని వేసింది. తమిళ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన తొలినాళ్లలో శింబుతో ప్రేమాయణం నడిపింది. వల్లభ సినిమా సమయంలో…మొగుడు పెళ్లాల కంటే ఎక్కువగా శింబుతో రాసుకుపుసుకొని తిరిగింది నయనతార. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అవకాశాల కోసమే శింబుతో ప్రేమాయణం నడిపిన నయన్…చివరికి అతన్ని కెరీర్ నాశనమయ్యేలా చేసింది. వల్లభ సినిమాలో మాదిరిగానే…శింబు నయన్ పిచ్చోడై…కొన్ని రోజులు ఎవరికి కనిపించకుండా గడిపాడు.

శింబుకు బై బై చెప్పాక…ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాను లైన్ లో పెట్టింది. పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్నట్లు క్రిస్టియానిటీకి గుడ్ బై చెప్పింది. హిందూ మతంలోకి మారిపోయి…ప్రభుదేవాతో పాటు గుళ్లు గోపురాలు తిరిగింది. నయన్ మాయలో పడ్డ ప్రభుదేవా…భార్యకు విడాకులు ఇచ్చాడు. సర్వం నయనతార అనుకునే తిరిగాడు. సినిమా ఇండస్ట్రీ, మీడియా ప్రపంచంలో చెడ్డవాడిగా మిగిలిపోయాడు. పెళ్లి చేసుకుందామని భార్యకు విడాకులిస్తే…నయనతార ఝలక్ ఇచ్చింది. కెరీర్ ఎదుగుదల కోసం ప్రభుదేవాను సంక నాకించేసింది. డ్యాన్స్ మాస్టర్…సినిమాలు కూడా చేయకుండా…నయన్ వెంట తిరిగాడు. అన్ని సెట్ అవుతాయనుకున్న సమయంలో…డయానా ఊహించని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ప్రభుదేవాకు బై బై చెప్పింది. ప్రేమలో మోసపోయానంటూ అభిమానులు, సినిమా ఇండస్ట్రీని నమ్మించింది. అందరూ ఆమె చెప్పిందే నమ్మేశారు. రంగుల ప్రపంచంలో ఎదగడానికే టాప్ సెలబ్రెటీలతో ఎఫైర్లు పెట్టుకుంది. అన్ని చక్క దిద్దుకున్న తర్వాత…ఒక్కొక్కరిని వాడుకొని వదిలేసింది. తాను ఎదగడానికి ఇతరుల కెరీర్ ను పణంగా పెట్టింది.

ధనుష్ బ్యానర్ లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో నేను రాడీనే సినిమాను చేసింది నయనతార. కెరీర్ పీక్ స్టేజ్ ఉండగానే… ముచ్చటగా మూడోసారి విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి రహస్యంగా దేశ విదేశాలు తిరిగారు. అతడితో కొన్నేళ్లు డేటింగ్ చేసిన తర్వాత…పెళ్లి చేసుకుంది. విఘ్నేశ్ శివన్ అయితే…తాను చెప్పినట్లు వింటాడని…తాను ఆడినట్లు ఆడుతాడని ఏడడుగులు వేసింది. శింబు, ప్రభుదేవాలు మోసం చేశారనే చెప్పే నయనతార…వారిని జనం ముందు విలన్లుగా చిత్రీకరించింది. తాను మంచిదాన్నని…వాళ్లే మోసం చేశారంటూ నీతి సూత్రాలు వల్లించింది. పనిలో పనిగా తాను మీటూ బాధితురాలేనని…ఓ నిర్మాత వేధించాడని చెప్పింది. మరి ఆమె వేధించిన వారు. బాధితుల గురించి ఎందుకు చెప్పడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

నయనతార ఏం చేసినా దాని వెనుక లెక్క ఉంటుంది. ప్రతి దాన్ని కమర్షియల్ గా ఆలోచించడంలో ఈ లేడీ డాన్ ముందు వరుసలో ఉంటుంది. సినిమా అవకాశాలు, ఆర్థికంగా స్థిరపడటానికి హీరో, డ్యాన్స్ మాస్టర్ తో అడ్డు అదుపు లేకుండా తిరిగింది. ఏది చేసినా దాన్ని డబ్బు కోణంలోనే చూసింది. హంగు ఆర్బాటాలు లేకుండా కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీలో అందర్ని పిలిచి పెళ్లి చేసుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని…తక్కువ మందితోనే వివాహం చేసుకుంది. పెళ్లి వీడియోను మాత్రం నెట్ ఫ్లిక్స్ అమ్మేసుకుంది. ఇక్కడ కూడా తాను కమర్షియల్ గానే ఆలోచించింది. కోట్ల రూపాయలు వెనుకేసుకోవడానికి అడ్డదారులు తొక్కింది. తనపై డాక్యుమెంటరీ తీస్తే…దానికి ముక్కు పిండి డబ్బు వసూలు చేసింది. ఇప్పుడు ధనుష్ 10 కోట్లు అడిగితే మాత్రం…విలువలు, నీతులు చెబుతోంది. తన మీద డాక్యుమెంటరీ తీస్తే డబ్బు వసూలు చేయాలి…అదే మనం డాక్యుమెంటరీ తీసి…పక్క వారి సినిమాల్లో క్లిప్ ను వాడుకుంటే మాత్రం డబ్బు ఎందుకు ఇవ్వాలని అంటోంది. జనం ముందు ధనుష్ చెడ్డవాడు…తానే మంచిదాన్ని అనేలా బిల్డ్ ఇస్తోంది.

ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి కొనసాగుతుందని నయనతార చెప్పుకొచ్చింది. తాను అతన్ని మనస్ఫూర్తిగా నమ్మితే…మోసం చేశారని తెలిపింది. తన గత రిలేషన్స్ గురించి ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ ప్రజలు మాత్రం ఇష్టం వచ్చినరీతిలో మాట్లాడుకున్నారని జనం ముందు సానుభూతి పొందేందుకు ప్రయత్నించింది. తాను ఒక అమ్మాయిని కాబట్టి అలా మాట్లాడుకోగలిగారని, అబ్బాయి అయితే మాట్లాడుకునేవారు కాదంటూ మాట్లాడింది. బడా హీరోలు, బ్యానర్లలో సినిమాలో చేసే నయనతార కండీషన్లకు నిర్మాతలే షాకవుతారు. షూటింగ్ లో మాత్రమే పాల్గొంటాను…మూవీ ప్రమోషన్లకు రాను అంటూ మొదట్లోనే మెలిక పెడుతుంది. అలా అయితే సినిమా చేస్తానంటూ నిర్మాతలను వేధించింది. నయనతార పెట్టే కండీషన్లను ప్రొడ్యూషర్లు బయట చెప్పుకోలేక…చచ్చినట్లు ఆమెకు పేమెంట్లు చేశారు. సినిమా రంగంలో ఏ హీరోయిన్ పెట్టని షరతులు ఆమె మాత్రమే పెడుతుంది. సినిమా ఫెయిల్ అయినా…సక్సెస్ అయినా తనకు సంబంధం లేదనేలా వ్యవహరిస్తోంది. తాను షూటింగ్ వరకే డేట్స్ ఇస్తా…ప్రమోషన్లు గిమోషన్లు జాన్తా నై అంటుంది.