NEET results 2024 : త్వరలో నీట్​ యూజీ 2024 ఆన్సర్​ కీ విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

NEET results 2024 : నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) త్వరలో విడుదల చేయనుంది.


ఆ తర్వాత.. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్​కు హాజరైన అభ్యర్థులు.. exams.nta.ac.in/NEETలోకి వెళ్లి నీట్ యూజీ పరీక్ష ప్రొవిజనల్ ఆన్సర్ కీ చెక్​ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, తేదీలను ఉపయోగించి డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

నీట్ యూజీ ఆన్సర్ కీతో పాటు ప్రశ్నాపత్రం, అభ్యర్థుల సమాధానాలను కూడా ఎన్​టీఏ షేర్​ చేస్తుంది..

నీట్ యూజీ ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు తమ ఫీడ్ బ్యాక్ పంపాలని ఎన్​టీఏ విజ్ఞప్తి చేస్తుంది. ఇందుకోసం వారు ఒక్కో క్వైరీకి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను ఆన్సర్ కీ నోటిఫికేషన్​ విడుదలైన తర్వాత తెలుస్తోంది.

NEET results 2024 answer key : ఈ ఏడాది 24 లక్షల మంది అభ్యర్థులు.. ఈ జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష రాశారు. నీట్ యూజీ 2024 మే 5 న ఒకే షిఫ్ట్​లో, భారతదేశం అంతటా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) జరిగింది.

ఇదీ చూడండి:- ICAI CA exam dates: సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించిన ఐసీఏఐ

నీట్ 2024 ఆన్సర్ కీని ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

స్టెప్​ 1:- exams.nta.ac.in. వెబ్​సైట్​లోకి వెళ్లండి.
స్టెప్​ 2:- నీట్ యూజీ 2024 పేజీని ఓపెన్ చేయండి.
స్టెప్​ 3:- మీ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేదీని నమోదు చేయండి.
స్టెప్​ 4:- వివరాలు సమర్పించాలి. ప్రొవిజనల్ ఆన్సర్ కీ, నీట్ యూజీ పరీక్షలో అడిగే ప్రశ్నలు తర్వాతి పేజీలో కనిపిస్తాయి.
NEET answer key 2024 : నీట్ యూజీ పరీక్షపై మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎన్​టీఏ హెల్ప్​లైన్​ నంబర్లు 011-40759000ను సంప్రదించవచ్చు. neet@nta.ac.in ఈ-మెయిల్ కూడా చేయవచ్చు.

తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్లు.. nta.ac.in, exams.nta.ac.in/NEET సందర్శించాలని ఎన్​టీఏ సూచించింది.

సాధారణంగా.. ఆన్సర్​ కీ విడుదలై, అభ్యంతరాలను నోట్​ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత.. నీట్​ ఫలితాలు వెలువడతాయి. ఈ ఏడాది జరిగిన నీట్​ యూజీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి? అన్న దానిపై సమాచారం లేదు. త్వరలోనే ఓ అప్డెట్​ వచ్చే అవకాశం ఉంది. ఆన్సర్​ కీ విడుదల తేదీపైనా అతి త్వరలోనే ఒక అప్డేట్​ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.