స్పోర్టీ లుక్ లో దుమ్మురేపుతున్న న్యూ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ తో 200KM రేంజ్

www.mannamweb.com


ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఆటోమొబైల్ మార్కెట్ ను శాసిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా అందరు ఈవీల జపమే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈవీల సేల్ ఘణనీయంగా పెరిగింది. ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బైక్స్ ను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈవీలకు వస్తున్న ఆదరణతో టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ లను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. టెక్నాలజీని యూజ్ చేసుకుని అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈవీ బైక్ లను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు లభ్యమవుతుండడంతో డిమాండ్ పెరిగింది. పైగా పెరిగిన పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు ఈవీలకు ప్రియారిటీ ఇస్తున్నారు. ఈవీల వాడకంతో ప్రయాణ ఛార్జీల ఖర్చు తగ్గిపోతుంది.

తక్కువ ఖర్చుతోనే వందలకొద్ది కిలోమీటర్లు ప్రయాణించే వీలుంటుంది. నడిపేందుకు కూడా ఈజీగా ఉండడంతో ఈవీలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంతో ఈవీలకు మార్కెట్ లో క్రేజీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్స్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త బైక్ బైక్ లవర్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. చెన్నైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ రాప్టీ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ రాప్టీ టీ30ను లాంచ్ చేసింది. ఈ బైక్ టీ30, టీ30 స్పోర్ట్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. స్పోర్టీ లుక్ లో అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇది భారతదేశపు మొట్టమొదటి హై-వోల్టేజ్ (హెచ్‌వీ) ఎలక్ట్రిక్ బైక్‌.

అయితే ఈ రాప్టీ టీ30 బైక్స్ రెండింటి ధర రూ.2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్‌). ఐడీసీ ఎస్టీమేటెడ్ రేంజ్ ప్రకారం ఇది సింగిల్ ఛార్జ్ తో 200కిమీలు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ కనీసం 150 కిమీల రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. రాప్టీ టీ30లో 5.4కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ గల 240 వోల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఈ బైక్ 3.5 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 135 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. 40 నిమిషాల్లో 20 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది ఐపీ67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ 8 ఏళ్లు లేదా 80,000 కిమీల వారంటీ కలిగి ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

ఈ బైక్‌లో మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. స్టైలీష్ లుక్ లో ఉన్న ఈ బైక్ లో స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌తో పాటు టచ్‌స్క్రీన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇందులో బైక్ స్పీడ్, బ్యాటరీ, టైమ్, స్టాండ్, బ్లూటూత్ కనెక్టివిటీ, జీపీఎస్ నావిగేషన్ వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌ల డెలివరీలు జనవరి 2025లో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కొనుగోలుదారులు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రూ.1,000 చెల్లించి ఈ బైక్ లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.