ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలవరీలో కొత్త మోసం..! జాగ్రత్త పడకుంటే తీవ్రంగా నష్టపోతారు..

 రోజుల్లో అందరూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. మీరు కూడా అలాగే చేస్తుంటే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మార్కెట్లో కొత్త స్కామ్ వెలుగు చూసింది.


ఈ మోసం చాలా సైలెంట్‌గా జరుగుతోంది. ఈ స్కామ్‌ గురించి తెలుసుకుంటే.. అది కేవలం సిస్టమ్ లోపం అని మీరు అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది రెస్టారెంట్‌కు హాని కలిగించే, కస్టమర్‌లను తప్పుదారి పట్టించే ఉచ్చు.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో ఒక కంటెంట్ సృష్టికర్త తనతో జరిగిన సంఘటనను అందరితో పంచుకున్నాడు. అది కాస్త వైరల్ అయింది. ఆ వీడియోలో.. నేను నా కోసం పిజ్జా ఆర్డర్ చేశాను. 15-20 నిమిషాల తర్వాత డెలివరీ బాయ్‌కి ప్రమాదం జరిగిందని మాకు కాల్ వచ్చింది. కాబట్టి రెస్టారెంట్ నేరుగా ఆర్డర్ డెలివరీ చేస్తుందని అతను చెప్పాడు. దీని తర్వాత నేను స్వయంగా రెస్టారెంట్ వారిని సంప్రదించాను, అక్కడ మేం డైరెక్ట్ డెలివరీ చేయమని నాకు సమాధానం వచ్చింది. ఇది విన్న తర్వాత నాకు కొంచెం అనుమానం వచ్చింది. దీని తర్వాత అతను స్విగ్గీ కస్టమర్ కేర్‌తో మాట్లాడాడు. ఆ తర్వాత నాకు సమాధానం వచ్చింది. ఆర్డర్ పూర్తి కాలేదు, కాబట్టి మొత్తం డబ్బు తిరిగి ఇచ్చారు. కొద్ది సేపటి తర్వాత డెలవరీ బాయ్‌ పిజ్జా తీసుకొని వచ్చాడు.

మీకు రీఫండ్ వచ్చి ఉంటుంది.. ఇప్పుడు మీరు నాకు పిజ్జా డబ్బులు ఇచ్చేసి ఈ ఆర్డర్‌ తీసుకోండి సార్‌ అని పిజ్జా డెలవరీ బాయ్‌ అన్నాడు. కస్టమర్‌కు అనుమానం వచ్చి రెస్టారెంట్‌కు కాల్ చేశాడు. ఆ రెస్టారెంట్‌ మేనేజర్ మాత్రం డబ్బు చెల్లించకండి.. పిజ్జా తీసుకోండి అని కస్టమర్‌కు చెప్పడంతో అతనికి అసలు విషయం అర్థమైంది. ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్ నుండి ఆర్డర్ తీసుకొని.. దానిని యాక్సిడెంట్‌ అనే అబద్ధంతో రద్దు చేస్తారు. కస్టమర్‌కి కంపెనీ నుంచి రీఫండ్ వస్తుంది. తరువాత యాక్సిడెంట్‌ అని అబద్ధం చెప్పిన డెలివరీ బాయ్‌ ఆ ఫుడ్‌ను కస్టమర్‌కు ఇచ్చి, అతని నుంచి నేరుగా డబ్బును తీసుకుంటున్నాడు. ఇది కంపెనీకి వెళ్లదు.. డెలవరీ బాయ్‌ జేబులోకి వెళ్తుంది. అతను యాక్సిడెంట్‌ అని అబద్ధం చెప్పి.. కంపెనీని మోసం చేస్తున్నాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.