Realme నుంచి బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ లాంచ్.. 26GB ర్యామ్, సూపర్ ఫీచర్లు

www.mannamweb.com


రియల్ మీ కంపెనీ నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్స్ తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగి ఉంటాయి. తాజాగా రియల్ మీ కంపెనీ పి1 స్పీడ్ 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకట్టుకునే డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ కొత్త కలర్ ఆప్షన్ తో విడుదల అయ్యింది. ఇంకా ఇది మాత్రమే కాదు, ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ ను అదిరిపోయే సూపర్ ఫీచర్లతో కంపెనీ ప్రవేశపెట్టింది. అది కూడా తక్కువ బడ్జెట్ లో లాంచ్ చేసింది. ఇక లేటెస్ట్ గా విడుదల అయిన ఈ స్మార్ట్ ఫోన్ పేరు రియల్ మీ పి1 స్పీడ్. ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్స్ ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్స్ వస్తాయి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రియల్ మీ పి1 స్పీడ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 7300 Energy 5G చిప్ సెట్ తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ లో అన్నిటికంటే నచ్చే ఎలిమెంట్ ఏంటంటే దీని ర్యామ్. ఈ స్మార్ట్ ఫోన్ 12GB ఫిజికల్ ర్యామ్, 14GB Dynamic RAM సపోర్ట్ తో టోటల్ గా 26GB హెవీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఇంకా ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. దీనికి 6.67 ఇంచెస్ OLED Esports స్క్రీన్ ఉంటుంది. ఇది చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ మాక్సిమం బ్రైట్నెస్, FHD+ రిజల్యూషన్ తో వస్తుంది. ఇక ఈ ఫోన్ కెమెరా అయితే అద్భుతం అని చెప్పాలి. 30 fps తో 4K వీడియోలు, ఫోటోలు క్యాప్చర్ చేసే విధంగా ఇందులో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇక ఫ్రంట్ 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ realme UI 5.0 సాఫ్ట్ వేర్ పై Android 14 పై రన్ అవుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. రియల్ మీ P1 స్పీడ్ 5G స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB + 128GB. ఈ వేరియంట్ రూ. 15,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇక హై ఎండ్ వేరియంట్ 12GB + 256GB. ఈ వేరియంట్ 17,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. పైగా ఈ ఫోన్ పైన మంచి లాంచ్ ఆఫర్స్ కూడా కంపెనీ ఇస్తుంది. ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను ఇస్తుంది. దీంతో దీన్ని మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అక్టోబర్ 20న ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది.