ఆర్‌బీఐ నూతన గవర్నర్‌ సంతకంతో కొత్త ₹50 నోట్లు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలో రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకంతో ఈ నోట్లు అందుబాటులోకి రానున్నాయి.


ప్రస్తుతం చాలా వరకు నోట్లు మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేరుతో ప్రింట్‌ అయినవే సర్క్యులేషన్‌లో ఉన్నాయి. ఆయన స్థానంలో సంజయ్‌ మల్హోత్రా గతేడాది డిసెంబర్‌లో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మహాత్మ గాంధీ సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను జారీ చేయాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ బుధవారం తెలిపింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న పాతనోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ పేర్కొనింది.