గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై చాలా హైప్ నెలకొంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా వచ్చే నెల జనవరి 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
సీనియర్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్లలో మూవీ టీమ్ జోరు పెంచుతోంది. గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో భాగంగా రామ్‍చరణ్ భారీ కటౌట్ హైలైట్‍గా నిలుస్తోంది. సరికొత్త రికార్డు నెలకొల్పేలా ఈ కటౌట్ ఉంది. ఆ వివరాలు ఇవే..
మాస్ గెటప్‍లో సూపర్
256 అడుగుల భారీ ఎత్తుతో రామ్‍చరణ్ కటౌట్ విజయవాడలో ఏర్పాటైంది. నల్ల బనియన్, పంచె ధరించి ఫుల్ మాస్ గెటప్‍లో రామ్‍చరణ్ కటౌట్ ఉంది. గేమ్ ఛేంజర్ చిత్రంలో ఓ యాక్షన్ సీన్‍లో ఈ గెటప్ ఉండనుంది. ఈ భారీ కటౌట్ విజయవాడలోని వజ్ర గ్రౌండ్‍లో ఏర్పాటైంది.
రికార్డుస్థాయిలో..
రామ్‍చరణ్ 256 అడుగుల కటౌట్ కొత్త రికార్డు సృష్టించనుంది. దేశంలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన అత్యధిక ఎత్తైన కటౌట్‍గా ఇది రికార్డుల్లోకి ఎక్కుతోంది. ఇప్పటి వరకు దేశంలో ఏ హీరో కూడా ఇంత ఎత్తైన కటౌట్ ఏర్పాటు చేయలేదు. ఇక గిన్నీస్ రికార్డు కోసం కూడా రామ్‍చరణ్ అభిమానులు ప్రయత్నిస్తున్నారు.
నేడే ఆవిష్కరణ కార్యక్రమం
ఈ భారీ రామ్‍చరణ్ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం నేటి (డిసెంబర్ 29) సాయంత్రం విజయవాడలోని వజ్ర గ్రౌండ్‍లో జరగనుంది. ఈ ఈవెంట్ కోసం హెలికాప్టర్ ఉంటుందని తెలుస్తోంది. కటౌట్‍తో అభిమానులపై పూలను చల్లేలా మూవీ టీమ్ ప్లాన్ చేసిందని సమాచారం. దీంతో ఈ కార్యక్రమంపై మరింత ఆసక్తి నెలకొంది.
గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవలే అమెరికాలోని డల్లాస్‍లో జరిగింది. గ్రాండ్‍గా ఈ ఈవెంట్ సాగింది. ఈ మూవీ సక్సెస్‍పై రామ్‍చరణ్ చాలా కాన్ఫిడెంట్‍గా ఉన్నారు. ఈ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ మూవీగా శంకర్ తెరకెక్కించారు. ఈ మూవీతో రామ్‍చరణ్‍కు నేషనల్ అవార్డు వస్తుందని ఈవెంట్‍కు హాజరైన స్టార్ డైరెక్టర్ సుకుమార్ అన్నారు. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్‌లో చెర్రీ యాక్టింగ్ రంగస్థలాన్ని మించిపోయిందంటూ హైప్ పెంచేశారు.
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ నటించారు. ఈ మూవీలో ఇటీవలే వచ్చిన దోప్ పాటలో చెర్రీ గ్రేస్‍ఫుల్ డ్యాన్స్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్ ముఖ్మమైన రోల్స్ పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.