కొత్త నెల ప్రారంభంతో, ఫిబ్రవరి 1 నుంచి చాలా ఇంపార్టెంట్ రూల్స్ (February 1 Rules Change) మారబోతున్నాయి. ఇవి హైవే ప్రయాణం నుంచి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వరకు రోజువారీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి.
ఆ తర్వాత ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే, వాహన యజమానులు, ఆస్తి కొనుగోలుదారులు ఈ అప్‌డేట్స్ గురించి ముందే తెలుసుకోవాలి. కొత్త రూల్స్ ఏంటో చూద్దాం.
ఫాస్టాగ్ యూజర్లకు రిలీఫ్ (FASTag Users Get Relief)
FASTagకి లింక్ చేసిన నో యువర్ వెహికల్ ప్రాసెస్ రద్దు చేయాలని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి FASTag వినియోగదారులు ఇకపై యాక్టివేషన్ తర్వాత పదే పదే KYC చెక్స్ చేయాల్సిన అవసరం లేదు. FASTagలను జారీ చేసే ముందు వాహన వివరాలను వెరిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పూర్తిగా బ్యాంకులపై ఉంటుంది. ఇంతకు ముందు తరచుగా డాక్యుమెంట్ అప్‌లోడ్‌లు, వెరిఫికేషన్ రిక్వెస్ట్‌లు కారణంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న జాప్యాలు, గందరగోళాన్ని ఈ మార్పు తొలగిస్తుందని భావిస్తున్నారు.
FASTag హోల్డర్లు ఏం చేయాలి?
ఇప్పటికే FASTag ఇన్‌స్టాల్ అయిన వాహనాలకు రొటీన్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ట్యాగ్ మిస్‌యూజ్, వదులుగా ఉన్న లేదా దెబ్బతిన్న FASTag లేదా వెహికల్ డీటైల్స్‌కి సంబంధించిన ఫిర్యాదు వంటి సమస్య ఉంటే మాత్రమే వినియోగదారులను రీ వెరిఫికేషన్ కోసం అడుగుతారు. మిగతా వారికి ఈ మార్పుతో ఎలాంటి సమస్యలు ఉండవు. టోల్ ప్లాజా వద్ద జర్నీ స్మూత్‌గా వేగంగా ఉంటుంది.
FASTag వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది?
రివైజ్డ్ ప్రాసెస్‌లో, బ్యాంకులు FASTagను యాక్టివేట్ చేయడానికి ముందు ఫుల్ వెహికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తాయి. వెహికల్ డీటైల్స్‌ని అఫీషియల్ వెహికల్ డేటాబేస్‌లోని వాటితో కంపేర్ చేస్తాయి. అక్కడ సమాచారం అందుబాటులో లేకపోతే, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను ఉపయోగించి వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన FASTagలకు కూడా వర్తిస్తుంది. అన్ని తనిఖీలు ముందుగానే పూర్తయ్యేలా చూసుకుంటే, వినియోగదారులకు తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
రిజిస్ట్రేషన్ (Land Registration) కోసం ఆధార్ తప్పనిసరి .
ఈ ప్రాసెస్ అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి, ఆల్టర్నేటివ్ వెరిఫికేషన్ మెథడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వృద్ధులకు లేదా వేలిముద్రలు మ్యాచ్ అవ్వని వారికి, ఫేస్ అథెంటికేషన్ అందుబాటులో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఆధార్ బేస్డ్ OTP వెరిఫికేషన్ కూడా ఉపయోగించవచ్చు. ప్రాపర్టీ ఫ్రాడ్, ఫేక్ ఐడెంటిటీలు, బినామీ రిజిస్ట్రేషన్లను నిరోధించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకొస్తున్నారు. నిజమైన కొనుగోలుదారులకు ప్రాసెస్ ఈజీ అవుతుంది. కొత్త రిజిస్ట్రేషన్ నియమాలు అన్ని పార్టీల కచ్చితమైన గుర్తింపును నిర్ధారించడం ద్వారా వివాదాలను తగ్గిస్తాయని భావిస్తున్నారు.


































