రైళ్లలో ( Trains ) ప్రయాణించే వారికి బిగ్ అలర్ట్. ఇకపైన లగేజీ విపరీతంగా తీసుకుపోతే… అదనపు చార్జీలు వసూలు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. 2025 ఏప్రిల్ నుంచి.. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్ ప్రకారం.. రైళ్లలో వెళ్లే ప్రయాణికులు… పరిమిత లగేజీ ( Railway Luggage Limit) మాత్రమే తీసుకువెళ్లాలి. లగేజీ బరువు… పరిమితులు దాటితే కచ్చితంగా రైల్వే శాఖకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఎయిర్ పోర్టులలో ఉన్నట్లే ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా చార్జీలు వసూలు చేస్తారు.
రైళ్లలో చార్జీలు లేకుండా లగేజీ ఎంత వరకు ఫ్రీగా తీసుకువెళ్లాలి ?
రైళ్లలో ప్రయాణికుడు 70 కేజీల వరకు లగేజీ ఉచితంగానే తీసుకు వెళ్ళవచ్చు. ఏసీ ఫస్ట్ క్లాస్ లో టికెట్ బుక్ చేసుకున్న వారికి.. ఈ సదుపాయం ఉంటుంది. 70 కేజీలు దాటితే… ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇక ఏసీ 2 టైర్ లో ప్రయాణించేవాళ్లు 50 కేజీల వరకు ఉచితంగా లగేజీ తీసుకు వెళ్ళవచ్చు. 50 కేజీలు దాటితే అదనపు చార్జీలు వసూలు చేస్తారు. Ac 3- టైర్ బుక్ చేసుకున్న వారు… 40 కేజీల వరకు లగేజీ తీసుకు వెళ్ళవచ్చు. అలాగే ఏసీ చైర్ కార్ టికెట్ బుక్ చేసుకున్న వారు 40 కేజీల వరకు ఉచితంగానే తీసుకు వెళ్ళవచ్చు. స్లీపర్ కోచ్, జనరల్ కోచ్ భోగిలలో ప్రయాణించే వారు కూడా 40 కేజీల వరకు లగేజీ ఉచితంగా తీసుకు వెళ్ళవచ్చు. ఆ 40 కేజీలు దాటిందంటే… కచ్చితంగా చార్జీలు వసూలు చేస్తుంది రైల్వే శాఖ. కాబట్టి ఇకపైన రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఈ రూల్స్ తెలుసుకొని.. వెళ్తే బెటర్.