పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సుకన్య సమృద్ధి వంటి పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఈ స్కీమ్‌లకు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం మార్పులు చేయనుంది. .కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల గురించి మీరు తెలుసుకోండి. అయితే మారిన ఈ నిబంధనల గురించి తెలుసుకుందాం. ఈ చిన్న పొదుపు పథకాలను కేంద్ర ప్రభుత్వమే ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏదైనా ఖాతా సక్రమంగా లేదని తేలితే..దానిని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన నిబంధనలకు అనుగుణంగా అవసరమైన క్రమబద్ధీకరణ కోసం పంపాలని పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం జాతీయ పొదుపు పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మరియు సుకన్య సమృద్ధి ఖాతా కోసం శాఖ ఆరు కొత్త నిబంధనలను జారీ చేసింది.
అక్రమ జాతీయ పొదుపు పథకం (NSS) ఖాతా, మైనర్ పేరు మీద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతా, బహుళ పీపీఎఫ్ అకౌంట్లు తెరిచినప్పుడు, NRIలు ప్రారంభించిన PPF ఖాతాలు వంటి వాటిలో మార్పులు ఉన్నాయి. సుకన్య సమృద్ధి ఖాతా పేరెంట్స్ కు బదులుగా గ్రాండ్ పేరెంట్స్ ప్రారంభించిన ఖాతాల రెగ్యులజైషన్ వంటివి ఇందులో ఉన్నాయి.
ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు తెచినట్లయితే ముందుగా ప్రారంభించిన అకౌంట్ కొనసాగిస్తారు. తర్వాత ఒపెన్ చేసిన అకౌంట్ ను మొదటి ఖాతాలో విలీనం చేయాల్సి ఉంటుంది. రెండుకు మించి అకౌంట్లు ఉన్నట్లయితే వాటికి వడ్డీ రాదని గుర్తించుకోండి. అలాంటి అకౌంట్లను మూసివేయాలి. ఇక యాక్టివ్ గా ఉన్న ఎన్‌ఆర్‌ఐ పీపీఎఫ్ ఖాతాలు సెప్టెంబర్ చివరి వరకు ఉంటాయి. వాటికి వడ్డీ కూడా వస్తుంది. ఆ తర్వాత రాదు. దీనికి పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ 4శాతం ఉంటుంది. సుకన్య, పీపీఎఫ్ మినహాయించి పిల్లల పేరుతో ఓపెన్ చేసిన చిన్న పొదుపు పథకాలు అకౌంట్ మీద సాధరాణ వడ్డీ వస్తుంది.
సుకన్య సమృద్ధి అకౌంట్ ను గార్డియెన్స్ కు బదులుగా తాతమ్మలు తెరిచినట్లయితే అప్పుడు గార్డియన్ షిప్ బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే లీగల్ గార్డియెన్ కు బదిలీ చేసుకోవాలి. అలాగే ఒకే కుటుంబంలో రెండుకు మించి ఖాతాలు ఉంటే వాటిని మూసివేయాలి. NSY స్కీమ్‌లో అత్యధికంగా 8.20 శాతం వడ్డీ రేటు అందిస్తుండగా.. పీపీఎఫ్ లో 7.10శాతం వడ్డీరేటును ఇస్తుంది
పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌కు సంబంధించిన నియమాలు నేరుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించి ఉంటాయి. ఈ పథకాలు ప్రధానంగా నేషనల్ స్మాల్ సేవింగ్స్ (NSS) పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం దీనికి సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను రూపొందించింది. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సుకన్య సమృద్ధి ఖాతా పథకం 2019ని ఉల్లంఘించే ఒకే కుటుంబంలో రెండు ఖాతాలు తెరిస్తే, ఆ ఖాతాలు మూసివేస్తారు.