మోదీ సర్కార్ భారీ ప్రకటన చేసింది. మహిళలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రసంగంలో మహిళల కోసం తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని అనుకోవచ్చు. మహిళలకు సులభంగా రుణాలు అందుబాటులో ఉండేలా.. కొత్త స్కీమ్ తీసుకువస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. ఐదేళ్ల టెన్యూర్‌లో టర్మ్ లోన్స్ అందిస్తామని వెల్లడించారు. దీని వల్ల 5 లక్షల మంది మహిళలకు ఊరట లభించనుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.
అలాగే నిర్మలా సీతారామన్ పలు కీలక అంశాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కోటి గిగ్ కార్మికులకు బెనిఫిట్ కలుగనుంది. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, జెప్టో, బిగ్‌బాస్కెట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పని చేసే కార్మికులకు ఊరట లభించనుంది. వీరికి కూడా ఇకపై గుర్తింపుగా ఐడి కార్డులు అందజేయనున్నారు. ఈ చర్య వల్ల కార్మికుల కోసం మరింత సామాజిక భద్రత ప్రయోజనాలను అందించడానికి దోహదపడుతుంది.
వీరికి కూడా ఆరోగ్య భద్రత కింద కొత్త ప్రయోజనాలు చేకూరనున్నాయి. అదనంగా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (PM Jan Arogya Yojana) కింద కోటి గిగ్ కార్మికులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందించనున్నారు. ఈ ప్రయోజనాల కోసం కార్మికులను e-Shram పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. జన్ ఆరోగ్య స్కీమ్ కింద కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం లభిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి పేరుతో ఒక స్కీమ్‌ను అందిస్తూ వస్తోంది. దీని కింద అర్హత కలిగిన వారు రుణాలు పొందొచ్చు. రూ.10 వేల నుంచి లోన్ తీసుకోవచ్చు. బ్యాంకులు వీరికి సులభంగానే స్కీమ్ కింద రుణాలు జారీ చేస్తుంది.అయితే నిర్మలమ్మ తాజా బడ్జెట్‌లో ఈ స్కీమ్‌కు సంబంధించి కీలక అంశాన్ని వెల్లడించారు. స్వనిధి స్కీమ్ కింద క్రెడిట్ కార్డులు కూడా జారీ చేస్తామని తెలిపారు. యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు అందిస్తామని ప్రకటించారు. లిమిట్ రూ.30 వేలు ఉంటుంది.