మార్కెట్‌లోకి హీరో ఎక్స్‌ట్రీమ్ నయా వెర్షన్.. ధరెంతో తెలిస్తే షాక్..!

www.mannamweb.com


భారతదేశంలో యువత ఇటీవల కాలంలో సూపర్ స్పీడ్‌తో రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లే బైక్స్ అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో దేశంలో ఏళ్లుగా హీరో కంపెనీ బైక్స్ అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరో కంపెనీకు సంబంధించి ఎక్స్‌ట్రీమ్ బైక్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 4కు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను హీరో కంపెనీ ఇటీవల లాంచ్ చేసింది. రూ. 1,38,500 ధరతో డిజైన్, మెకానిక్స్, ఫీచర్లతో సహా ఇతర అప్‌డేట్స్‌ వినియోగదారులను ఆకట్టుకుంటాయని హీరో ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో ఎక్స్‌ట్రీమ్ 16 ఆర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వీ నయా వెర్షన్ బ్లాక్ కలర్, బ్రాంజ్ గ్రాఫిక్స్ కలయికతో కొత్త పెయింట్ స్కీమ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా సింగిల్ పీస్ సీట్ సిట్-సీట్ డిజైన్‌లో ఆకట్టుకుంటుంది.  డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌కు సపోర్ట్ చేసే ఈ బైక్ డ్రాగ్ రేస్ టైమర్‌తో బైకర్స్‌ను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పానిక్ బ్రేకింగ్ అలర్ట్ ఫీచర్‌తో పాటు దీని వలన టెయిల్ ల్యాంప్ ఈ బైక్‌కు సరికొత్త లుక్‌ను తీసుకువచ్చింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 4వీ బైక్ పవర్ ట్రెయిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని హీరో కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నరు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 4వీ 163.2 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్/ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 16.6 బీహెచ్‌పీ శక్తిని, 14.6 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. అలాగే సస్పెన్షన్ అప్డ్-డౌన్ ఫోర్క్స్, ప్రీలోడ్ సర్దుబాటుతో కూడిన మోనోషాక్ ద్వారా వస్తాయి. ఈ నేపథ్యంలో నయా వెర్షన్ హీరో బైక్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, హెూండా ఎస్‌పీ 160, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ, యమహా ఎఫ్‌జెడ్ఎస్ ఎఫ్ఐ వీ 4 బైక్స్‌కు గట్టి పోటినిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.