ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. జనవరి 1 సెలవుపై బిగ్ ట్విస్ట్..! తాజా ఉత్తర్వులు

www.mannamweb.com


కొత్త ఏడాది సెలబ్రేషన్స్ ఇప్పటికే అన్ని చోట్ల ప్రారంభమైపోయాయి. కొంత మంది తమ ఫ్యామిలీస్ తో సెలబ్రేషన్స్ చేసుకుంటే..

మరికొందరు మాత్రం.. హోటల్స్, రెస్టారెంట్ లలో ఈవెంట్ లు హజరయ్యేందుకు ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జనవరి 1న ప్రభుత్వ సెలవులుగా ప్రకటిస్తున్నాయి.

అయితే.. ఈసారి కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు జనవరి 1న ప్రభుత్వ హలీడేగా డిక్లేర్ చేసింది. దీంతో జనవరి 1న ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు బంద్ ఉండనున్నాయి. ఈ క్రమంలో ఏపీ సర్కారు మాత్రం.. జనవరి 1ని సెలవు దినంగా కాకుండా.. ఆప్షనల్ హలీడేగా ప్రకటించినట్లు తెలుస్తొంది. దీంతో ప్రభుత్వ సెలవు లేదని.. కేవలం ఆరోజు ఆప్షనల్ హలీడే ఉందని తెలుస్తొంది.

ఈక్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా నడవనున్నట్లు తెలుస్తొంది. అయితే.. డిసెంబరు 31న చాలా మంది నైట్ అవుట్ లు చేసి పార్టీలు చేసుకుంటారు. ఈ క్రమంలో మరుసటి రోజు మాత్రం.. ఏపీసర్కారు ఈ విధంగా ట్విస్ట్ ఇవ్వడంతో మాత్రం.. కొంత మంది తెగ బాధపడిపోతున్నారంట.

చాలా మంది కొత్త ఏడాది వచ్చిందంటే.. వరుసగా సెలవులు పెట్టి ఎక్కడికైన టెంపుల్స్ లేదా సరదాగా గడిపే విధంగా ప్లాన్ లు చేసుకుంటారు. అయితే.. ఈసారి మాత్రం కూటమి సర్కారు ఈవిధంగా ట్విస్ట్ ఇచ్చిందేంటీ అని కొంత మంది తలలు పట్టుకుంటున్నారంట. మొత్తానికి ఏపీ సర్కారు నిర్ణయం పట్ల కొందరు మనస్తాపానికి గురౌతున్నారంట.