ఏపీలో పెన్షన్ దారులకు న్యూ ఇయర్ గిఫ్ట్

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సర కానుక(New Year Gift)ను అందించేందుకు సిద్ధమైంది. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్లు (Pensions) జారీ చేస్తుండగా, ఈసారి డిసెంబర్ 31నే వాటిని అందజేయాలని నిర్ణయించింది.

కొత్త సంవత్సరం వేళా ప్రజలకు సంతోషాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ప్రతి నెలా రూ. 4,000 పెన్షన్ అందిస్తున్నారు.

ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఆర్థికంగా స్వల్పంగా ఉపశమనాన్ని పొందుతున్నారు. డిసెంబర్ 31న పెన్షన్లు అందించడమే కాకుండా, ఈ సేవలను సకాలంలో అందజేయడం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పెన్షన్ పంపిణీ కోసం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్లను అందజేయనున్నారు. దీని వల్ల వృద్ధులు, దివ్యాంగులు కొత్త సంవత్సరం వేళా మరింత సంతోషంతో గడపనున్నారు. ఇక ఎన్నికల్లో చెప్పినట్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ ను పెంచడం జరిగింది. అలాగే సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీఠం వేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటూ వెళ్తున్నారు.