Ration Card: కొత్త పెళ్లైన జంటలు రేషన్ కార్డులు పొందాలంటే.. ఇలా అప్లై చేసుకోండి.

కొత్తగా పెళ్లైన వారు కొత్త రేషన్ కార్డు ఎలా పొందాలని ఆందోళన చెందుతున్నారు. అయితే కొత్త జంట ముందుగా పాత కార్డుల్లో అంటే తల్లిదండ్రుల కార్డుల్లో ఉన్న తమ పేర్లను తొలగించాలి. ఎందుకంటే కొత్త రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో ఆధార్ నెంబర్ కొట్టగానే పాత కార్డులో పేరు ఉన్నట్లు చూపిస్తుంది. ఈ పేరు తొలగింపునకు కూడా అప్లై చేసుకోవాలి. పేరు తొలగింపు తర్వాత కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక సివిల్ సప్లై సర్కిల్ ఆఫీసుల్లో ఈ పేరు తొలగింపునకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న 3 రోజుల్లో పాత రేషన్ కార్డులో పేరు తొలగిపోతుంది. తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.


17 సంవత్సరాల తర్వాత BSNL లాభాల బాట పట్టింది. 2024-25 మూడవ త్రైమాసికంలో బిఎస్ఎన్ఎల్ రూ.262 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది. జియో మరియు ఎయిర్‌టెల్ ఇటీవల రీఛార్జ్ ధరల పెంపుదలతో చాలా మంది కస్టమరర్లు బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే నెట్‌వర్క్ విస్తరణ ఈ లాభాలకు కారణమని పేర్కొంది. 2007 తర్వాత మొదటిసారిగా లాభాల్లోకి బీఎస్‌ఎన్‌ఎల్‌ తిరిగి రావడం విశేషం.