పాన్ మసాలా, గుట్కాపై నిర్మాలా సీతారామన్ సర్జికల్ స్ట్రైక్..పార్లమెంటులో కొత్త బిల్లు…ఇక పొగాకు ముట్టుకుంటే షాకే…ఏ సిగరెట్లపై ఎంత పన్ను అంటే..?

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పొగాకు సంబంధించిన ఉత్పత్తుల పైన కఠిన నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన రెండు బిల్లులను ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు.


ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పొగాకు సిగరెట్లు పాన్ మసాలా వంటి ఉత్పత్తుల పైన కొత్త పన్ను విధానం అమలు చేసేందుకు ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టినట్లు గమనించవచ్చు. ఈ బిల్లులను సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్ మెంట్ బిల్ – 2025, ది హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025 పేరిట పిలుస్తున్నారు. ఈ బిల్లులను ప్రవేశ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఇప్పటివరకు పొగాకు ఉత్ప త్తులపై ఉన్నటువంటి పన్ను భారాన్ని కొనసాగించడంతోపాటు, జీఎస్టీ లో ఉన్నటువంటి కంపెన్సేషన్ సెట్స్ ముగుస్తున్న నేపథ్యంలో కొత్త విధానాల ద్వారా ఈ పనులను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు బిల్లులను నేడు పార్లమెంటు లోని లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వీటిపై చర్చ జరుగుతుంది. అనంతరం ఓటింగ్ ఆ తర్వాత రాజ్యసభలో కూడా చర్చ నడుస్తుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారనుంది.

పొగాకు, సిగరెట్లపై కొత్త పన్నులు
నూతన బిల్లుల ద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి జీఎస్టీ కంపెన్సేషన్ సెస్ తొలగించనున్నారు. దాని స్థానంలో ఎక్సైజ్ డ్యూటీని పెంచనున్నారు. తద్వారా గతంలో మాదిరిగానే పొగాకు పై దాని ఉత్పత్తులపై ధరలు పెంచేందుకు ఇది తోడ్పడుతుంది. అలాగే దీనికి అదనంగా 40 శాతం జీఎస్టీ కూడా అమల్లో ఉంటుంది.

ముడి పొగాకుపై 60 నుంచి 70 శాతం ఎక్సైజ్ డ్యూటీ
>> ముడి పొగాకు. అంటే ఎండబెట్టిన పొగాకు, పొగాకు ఆకులు, ప్రాసెస్ చేయని పొగాకుపై 60 నుండి 70 శాతం వరకూ కొత్త ఎక్సయిజ్ డ్యూటీ విధించనున్నారు. అలాగే ఇందులో బీడీ లేదా గుట్కాలో వినియోగించే పొగాకు మిగులు చూర్ణం కూడా భాగం చేశారు. అయిటే పొగాకు తయారీ దశ నుంచే ధరలు పెరగునున్నాయి. ఉదాహరణకు తయారీ దారులు పొగాకును కొనే సమయంలో అతడు 100 రూపాయల పొగాకు కొంటే దానిపై 60 నుంచి 70 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే పొగాకు కొనుగోలు దశ నుంచే తయారీ దారుపై భారం పడుతుంది.

సిగార్స్, పొకాగు రోల్స్ పై
>> సిగార్స్ అలాగే పొగాకుతో చేసే రోల్స్ పైన ఉత్పత్తి విలువపై 25 శాతం పన్ను విధించనున్నారు. అలాగే ప్రతి 1000 సిగార్లకు 5000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ మొత్తం వస్తుందో అది పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది.

ఫిల్టర్ లేని సిగరెట్లపై పన్ను ఎంతంటే..?
ఫిల్టర్ లేనటువంటి 65 మిల్లీమీటర్ల సిగరెట్ల పైన ప్రతి 1000 సిగరెట్లకు గాను 2700 రూపాయల పన్ను విధిస్తున్నారు. ప్రతి 1000 సిగరెట్లకు గాను ప్రతిసారి 2700 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ ప్రభుత్వానికి చెల్లించాలి. ఉదాహరణకు లక్ష సిగరెట్లు కనుక ఉత్పత్తి చేసినట్లయితే తయారీ సంస్థ రూ. 2,70,000 ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.

65 mm కంటే పెద్ద సిగరెట్లపై పన్ను ఎంతంటే..?
ప్రతీ 1000 సిగరెట్లపై 4500 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు.

65 mm లోపు ఫిల్టర్ సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను ప్రతీ 1000 సిగరెట్లకు రూ. 3,000

65-70 mm లోపు ఫిల్టర్ సిగరెట్లపై ప్రతి 1000 సిగరెట్లకు గానూ రూ. 5,200 ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.