నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఎస్యూవీ ఇంకొన్ని రోజుల్లో లాంచ్కానుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటైన నిస్సాన్ మాగ్నైట్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మోడల్ లాంచ్ డేట్ రివీల్ అయ్యింది. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 4న అరంగేట్రం చేయనుంది. దీనికి సంబంధించి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిస్సాన్ డీలర్షిప్ షోరూమ్స్‌లో కొత్త ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 5న డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌పై ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకుందాము..
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు ఇవే..!
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది. గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లతో పాటు అప్డేటెడ్ ఫ్రెంట్ ఫ్యాసియాతో పాటు ఫ్రెంట్, రేర్ బంపర్‌కు రీడిజైన్ చేయడం జరుగుతుంది. టెయిల్ లైట్లు కూడా కొత్త డిజైన్‌ను పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా, నిస్సాన్ ఇప్పటికే సూచించినట్లుగా, ఫేస్‌లిఫ్ట్ మోడల్ కొత్త డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. లోయర్ స్పెక్ మోడళ్లు కొత్త ప్లాస్టిక్ వీల్ కవర్ డిజైన్‌ను పొందుతాయని భావిస్తున్నారు.
సింగిల్ ప్యాన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో కూడిన భారీ 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, డ్రైవర్ కోసం 7 ఇంచ్ డిజిటల్ డిస్ప్లే వంటి కొన్ని కొత్త ఫీచర్ల రూపంలో ఈ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్యూవీ క్యాబిన్ కొన్ని నవీకరణలను పొందే అవకాశం ఉంది. డ్యాష్‌బోర్డు కోసం కొత్త మెటీరియల్, సీట్ల కోసం కొత్త అప్హోలిస్టరీ కూడా ఉండవచ్చు.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్: ఇంజిన్..
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్‌లో మార్పులు కనిపించవని తెలుస్తోంది. ప్రస్తుత మోడల్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ లేదా టర్బోఛార్జ్డ్ యూనిట్ ద్వారా పనిచేస్తుంది. రెండూ మూడు సిలిండర్ల ఇంజిన్లు. 1.0-లీటర్ సామర్థ్యం కలిగి ఉంటాయి.
నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71బీహెచ్ప పవర్, 96ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బోఛార్జ్డ్ యూనిట్ 98బీహెచ్పీ పవర్, 160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5-స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ ఏఎమ్టీతో కనెక్ట్ చేసి ఉంటుంది. మరోవైపు, టర్బోఛార్జ్డ్ ఇంజిన్ 5-స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ లేదా సీవీటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.
ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభమై రూ.11.27 లక్షల వరకు ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.
నిస్సాన్ మాగ్నైట్ గ్లోబల్ ప్రొడక్ట్‌గా ఉంటుందని కంపెనీ గతంలో వెల్లడించింది. నిస్సాన్ మోటార్ ఇండియా తన టీజర్‌ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని నొక్కి చెప్పింది, “ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్న ఎస్‌యూవీని డ్రైవ్ చేయండి. ఒక కారు.. ఒకే ప్రపంచం. త్వరలోనే వస్తాను,” అని పేర్కొంది.
హెచ్‌టీ ఆటోతో ఇటీవల జరిగిన సంభాషణలో నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స మాట్లాడుతూ.. రాబోయే కొత్త మోడల్‌తో, నిస్సాన్ మోటార్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్‌ని 40 దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాలని యోచిస్తోందని, ఇందులో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్లు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విధంగా నిస్సాన్ మాగ్నైట్ గ్లోబల్ కారుగా మారుతుందని, దీనిని భారతదేశంలో రూపొందించి తయారు చేస్తామని వత్స పేర్కొన్నారు.
మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్.. నిస్సాన్ మోటార్ ఇండియా తిరిగి ట్రాక్‌లోకి తీసుకు రావడానికి కీలకంగా పనిచేస్తుందని సంస్థ భావిసతోంది. గత కొంత కాలంగా నిస్సాన్ వెనుకంజలో ఉన్నప్పటికీ, కంపెనీ ఇప్పుడు తన కొత్త ప్రణాళికతో మార్కెట్‌కు సేవలందించడానికి కట్టుబడి ఉందని వత్స నొక్కి చెప్పారు.