Nitin Gadkari: డీజిల్‌, పెట్రోల్‌ కార్లను పూర్తిగా బంద్ చేస్తాం..

www.mannamweb.com


భారత దేశంలో డీజిల్‌, పెట్రోల్‌ కార్ల వాడకానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరో సారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను చెప్పింది సాధించడం కష్టమే కానీ.. అసాధ్యం మాత్రం కాదని తెలిపారు. ‘100 శాతం’ సాధ్యమేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు, పరిశ్రమల ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పులను ఇందుకు ఉదహరణగా చెప్పుకొచ్చారు. ఇందుకోసం హైబ్రిడ్‌ వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని కోరారు. ఇక, దేశంలోని 36 కోట్లకు పైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను తొలగిస్తామని కేంద్రమంత్రి గడ్కరీ అన్నారు. ఇంధన దిగుమతుల కోసం దేశం 16 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు.

అలాగే, మన పక్క ఇళ్లో ఇప్పుడు చాలా ఎలక్ట్రిక్‌ కార్లు కనిపిస్తున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇది అసాధ్యం అనుకున్న ప్రజలే తమ ఆలోచనను మార్చుకున్నారు అని పేర్కొన్నారు. టాటా, అశోకా లేల్యాండ్‌ కంపెనీలు హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులను ప్రవేశ పెట్టాయి.. ఎల్‌ఎన్జీ లేదా సీఎన్జీతో నడిచే ట్రక్కులు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే పెట్రో వాహనాలకు పూర్తిగా స్వస్తి పలకడం ఎప్పుడు సాకారమవుతుందో అనేది మాత్రం నితిన్ గడ్కర్ కచ్చితంగా చెప్పలేకపోయారు.