ఇండియన్ క్రికెట్ టీమ్ కు సెలెక్ట్ అయిన నితీశ్ కుమార్ రెడ్డి కు అభినందనలు తెలిపిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్..
ఏసిఏ తరుఫున యువ నితీష్ కుమార్ రెడ్డికి 25 లక్షల నగదు ప్రకటించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రోత్సాహక నగదు బహుమతిని నితీష్ కుమార్ రెడ్డికి అందిస్తామన్న ఏసిఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్.. నితీశ్ కుమార్ రెడ్డి ఇండియా క్రికెట్ టీమ్ తరుఫున ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడేందుకు ఎంపిక కావటం శుభపరిణామం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆల్ రౌండర్ గా నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తున్నాడు.
నితీశ్ కుమార్ రెడ్డి లాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. నేటి యువతకు నితీష్ కుమార్ రెడ్డి రోల్ మోడల్. దేశంలోనే అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియంను అమరావతిలో నిర్మిస్తాం. అదేవిధంగా విశాఖపట్నం స్టేడియం సిద్ధం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఐపీఎల్ టీమ్ సిద్ధం చేసేలా ACA ఆలోచన చేస్తోంది.