చికెన్ వద్దు బాబు..ఈ ఎముకలు లేని చేప తింటే ఎంతో మేలు

ప్రస్తుతం చాలా మంది మటన్, చికెన్ వదిలి చేపలు తినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో చేపలు తినేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అయితే చేపలు తినే వారు ఏ చేపలు తీసుకోవాలి?


ఏ రకం చేపలు ఆరోగ్యానికి మంచిది అనే అన్వేషించడం కూడా ఎక్కువైపోయింది. అందుకోసమే మంచి ప్రోటీన్ ఉండి, చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ చేప గురించి తెలుసుకుందాం.

వైరల్ ఫిష్ లేదా స్నక్ హెడ్ ముర్రెల్, దీనిని కొర్రె మీను అని కూడా పిలుస్తారు. ఈ చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదంట. చిత్తడి ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. నీరు లేకున్నా, ఎక్కువ కాలం భూమిపై జీవిస్తుంది ఈ రకం చేపలు.

ఈ రకం చేపల్లో ముళ్లు, ఎముకలు ఉండవు. ఇది ఎక్కువగా డెల్టా జిల్లాల్లో కనిపిస్తుంది. దీనికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. కాబట్టి అత్యధిక ధర పెట్టి ఈ రకం చేపలను కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే? దీనినిలో అనేక పోషకాలు ఉంటాయి.

ఈ రకం చేపలు ప్రోటీన్ మూలం. ఇందులో ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్, కాల్షియం, భాస్వరం, ఐరన్ , సెలీనియం , పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే అధిక ప్రోటీన్ కారణంగా ఇది కండరాల పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది.

అదేవి విధంగా ఈ చేపలో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువలన ఇది ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. ఇందులోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.