భారతీయులకు ట్రంప్ షాక్ ఇచ్చారు, 2027 వరకు H-1B వీసా ఇంటర్వ్యూలు లేవు

అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం భారతీయులకు వరుస షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే H-1B వీసా రుసుములను పెంచగా, ఇప్పుడు వీసా ఇంటర్వ్యూలు దొరకని పరిస్థితి ఏర్పడింది.


ఇంటర్వ్యూ తేదీలు 2027 వరకు వాయిదా పడటంతో భారతీయ నిపుణులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇంటర్వ్యూల వాయిదా: ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస నిబంధనలు కఠినమయ్యాయి. ముఖ్యంగా H-1B వీసా అపాయింట్‌మెంట్ల కోసం నిరీక్షణ సమయం భారీగా పెరిగింది. కొత్తగా వీసా దరఖాస్తు చేసుకునే వారే కాకుండా, వీసా స్టాంపింగ్ కోసం భారతదేశానికి వచ్చిన వారు కూడా అక్కడే చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది. 2025 చివరలో జరగాల్సిన ఇంటర్వ్యూలు మొదట 2026కి, ఇప్పుడు ఏకంగా 2027 వరకు వాయిదా పడుతున్నాయని సమాచారం.

నిపుణుల హెచ్చరిక: అమెరికాలో ఉంటున్న H-1B ఉద్యోగులు వీసా స్టాంపింగ్ కోసం ప్రస్తుతానికి భారతదేశానికి వెళ్లకపోవడమే మంచిదని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. ఎమిలీ న్యూమాన్ అనే నిపుణురాలు మాట్లాడుతూ, “గత 50 రోజులుగా కొత్త అపాయింట్‌మెంట్‌లు ఓపెన్ అయినట్లు కనిపించడం లేదు. బైడెన్ కాలంలో వీసాలు వేగంగా క్లియర్ అయ్యేవి, కానీ ఇప్పుడు అధికారులు వీసాలను నిరాకరించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు” అని తెలిపారు.

దీంతో ఇప్పటికే ఇండియాకు వచ్చిన వారు, అమెరికా వెళ్లాలనుకునే వారు అయోమయంలో పడ్డారు. పరిస్థితి ఇప్పట్లో చక్కబడే సూచనలు కనిపించడం లేదని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.