జిరాక్స్ కష్టాలకు ఇక చెల్లు.. ఆ ప్రింటర్స్‌పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు

www.mannamweb.com


బ్రదర్ డీసీపీ టీ 820 డీడబ్ల్యూ ప్రింటర్ అమెజాన్‌లో 38 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ మల్టీఫంక్షన్ ప్రింటర్‌ ద్వారా పేపర్లను కాపీ చేయవచ్చు, అలాగే స్కాన్ చేయవచ్చు.

వైర్‌లెస్ కనెక్టివిటీ కారణంగా సెల్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల నుంచి డాక్యుమెంట్‌లను ముద్రించే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఆటో డ్యూప్లెక్స్ ఫంక్షన్‌తో వచ్చే ఈ ప్రింటర్ ధర రూ.19,340గా ఉంది.

కెనాన్ పిక్స్‌మా ఈ4570 ఇంక్‌జెట్ ప్రింటర్ ఇంట్లో లేదా కార్యాలయాల్లో ఉపయోగించడానికి అనువగా ఉంటుంది. ప్రింటింగ్, స్కానింగ్, కాపీ చేయడం, ఫ్యాక్స్ చేసే వారికి ఈ ప్రింటర్ మంచి ఎంపిక యూఎస్‌బీతో పాటు వైఫై కనెక్టవిటీతో వచ్చే ఈ ప్రింటర్‌లో ఏ4, ఏ5 పేపర్లను ప్రింట్ తీయవచ్చు. ఈ ప్రింటర్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.7799గా ఉంది.

కెనాన్ పిక్స్‌మా ఈ 477 ప్రింటర్ ప్రస్తుతం అమెజాన్‌లో ఏకంగా 65 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. అనేక అధునాత ఫీచర్లతో వచ్చే ఈ ప్రింటర్ గృహ వినియోగానికి గొప్ప ఎంపికగా ఉంటుంది. ముఖ్యంగా మన ఫోన్‌లో తీసుకున్న పిక్చర్స్‌ను ప్రింట్ చేయడం, స్కాన్ చేయడం, కాపీ చేయడానికి అనువుగా ఉండే ప్రింటర్ మీ కంప్యూటర్, టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఈ ప్రింటర్ ధర కేవలం రూ.5899గా ఉంది.

హెచ్‌పీ లేజర్ 1008 డబ్ల్యూ ప్రింటర్ అమెజాన్‌లో 24 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ప్రింటర్ ద్వారా నిమిషానికి 21 పేపర్లను ప్రింట్ తీయవచ్చు. ఈ ప్రింటర్‌ను కూడా వైఫై లేదా యూఎస్‌బీతో కనెక్ట్ చేయవచ్చు. ఏ4,ఏ5, బీ5 పేపర్లను ప్రింట్ తీసే సామర్థ్యం ఉన్న ఈ ప్రింటర్ ధర రూ.11999గా ఉంది.

హెచ్‌పీ ఇంక్ అడ్వాంటేజ్ 2878 ప్రింటర్ ప్రస్తుతం అమెజాన్‌లో 38 శాతం తగ్గింపుతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ ప్రింటర్ చిన్న కార్యాలయాలు, గృహాల్లో వాడడానికి అనువుగా ఉంటుంది. ఈ ప్రింటర్ ద్వారా నిమిషానికి 7 పేపర్లను ప్రింట్ తీయవచ్చు. ఏ4, బీ5 పేపర్లను ప్రింట్ తీసుకోవడానికి అనువుగా ఉండే ఈ ప్రింటర్ హెచ్‌పీ స్మార్ట్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రింటర్ ధర ప్రస్తుతం రూ.5899గా ఉంది.