మీరు శక్తివంతమైన మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నట్లయితే.. హోండా CBR650R E-క్లచ్ బెస్ట్ కావొచ్చు! తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ మిడిల్-వెయిట్ స్పోర్ట్స్ బైక్‌ను మే నెలలో లాంచ్ చేశారు. దీనిని ప్రత్యేకంగా హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 10.40 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ప్రత్యేకతలను తెలుసుకుందాం..
ఈ శక్తివంతమైన స్పోర్ట్స్ టూరర్ 649cc, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ 4-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 94bhp శక్తిని, 63Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే.. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది. మీకు E-క్లచ్ కావాలనుకుంటే.. 40,000 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. హోండా CBR650R E-క్లచ్‌లో 310mm డ్యూయల్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ (ముందు), 240mm సింగిల్ డిస్క్ (వెనుక), డ్యూయల్ ఛానల్ ABS వ్యవస్థను కలిగి ఉంది. దీనికి 5-అంగుళాల TFT డిస్ప్లే అమర్చారు. ఈ బైక్‌లో హోండా రోడ్‌సింక్ యాప్ ఇన్‌స్టాల్ చేశారు. ఇందులో కాల్, మెసేజ్, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి.
హోండా E-క్లచ్ ఎలా పనిచేస్తుంది?: సుమారు 2 కిలోల బరువున్న ఈ వ్యవస్థ క్లచ్ ఎంగేజ్‌మెంట్‌ను ఎలక్ట్రానిక్‌గా నిర్వహించడానికి యాక్యుయేటర్‌లు, మల్టిపుల్ సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. క్లచ్‌లెస్ గేర్ మార్పులు, స్టాప్-గో ట్రాఫిక్‌లో స్టాల్-ఫ్రీ ఆపరేషన్‌ను అందిస్తుంది. అంటే ఈ వ్యవస్థ రైడర్ క్లచ్ ఉపయోగించకుండానే గేర్లు మార్చడానికి అనుమతిస్తుంది. అయితే రైడర్ కావాలనుకుంటే మోటార్ సైకిల్‌పై మరింత కంట్రోల్ కోసం ఫుల్లీ ఫంక్షనల్ క్లచ్ లివర్‌ను ఉపయోగించొచ్చు.
































