ఆమధ్య బెంగళూరులో ఇడ్లీని బ్యాన్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ మహా నగరంలో కూడా వస్తోంది. ప్రపంచమంతా మొత్తం ప్లాస్టిక్ మయంగా మారిపోయింది. ఇంట్లో వాడే వస్తువుల నుంచి హోటల్స్‌లో మనం తినే పేపర్ ప్లేట్స్ వరకు అంతా యమ డేంజర్‌గా మారింది. ఇదే ఇప్పుడు కేన్సర్‌కు కారణం అవుతోంది. బెంగుళూరులో ఇడ్లీలో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించడంతో అక్కడి ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయటం దేశ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ఏకంగా ఇడ్లీ వాయ వేసేటప్పుడు వస్త్రంతో కాకుండా ప్లాస్టిక్ కవర్‌లో ఇడ్లీలను వేస్తున్నారు. దీంతో ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి, దాని అవశేషాలు ఇడ్లీలోకి చేరిపోతున్నాయి. దీంతో ఇడ్లీలో ప్లాస్టిక్ అవశేషాలు కనిపిస్తున్నాయి. ఇది వెలుగులోకి రావడంతో…ప్లాస్టిక్ కవర్లతో ఇడ్లీలు వేయడాన్ని బ్యాన్ చేస్తూ కర్నాటక సర్కార్ చర్యలు తీసుకుంది.
అంతేకాకుండా.. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లోని హోటళ్లు, ఇండ్లీ బండ్లపై దాడులు నిర్వహించారు. అంతేకాకుండా ఇడ్లీ శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపించారు. ప్లాస్టిక్ షీట్ లలో ఇడ్లీలు వేయడంపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని FSSAI కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.. అంతేకాకుండా.. ప్లాస్టిక్ ఇడ్లీ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
మనం తినే పదార్థాల్లో ప్లాస్టిక్ కలిస్తే జరిగే అనర్థాలేంటో చూద్దాం..
క్రూడాయిల్ నుంచి తయారయ్యే ప్లాస్టిక్
ప్లాస్టిక్‌లో ఉండే కార్సోజెనిక్ రసాయనం
ప్లాస్టిక్ ద్వారా మన శరీరంలోకి చేరే కార్సోజెనిక్
కార్సోజెనిక్ ద్వారా కేన్సర్ వచ్చే అవకాశం
ఆహార తయారీలోప్లాస్టిక్ కవర్ల వినియోగం
ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి ఆహార పదార్థాల్లో చేరుతున్న వైనం
వాటి ద్వారా మన శరీరంలోకి కార్సోజెనిక్.. ఇలా మనం ఆరోగ్యం ప్రభావితం అవుతుంది.
కార్సోజెనిక్ కేన్సర్ కారకం అని, అది ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలో చేరితే కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. సో. ఇడ్లీలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అయ్యేకొద్దీ, మనకు కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయంటున్నారు వైద్యులు
ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పెట్రోలియం ప్రొడక్ట్ అయిన ప్లాస్టిక్‌ని బ్యాన్ చేసి, ప్రజలు కేన్సర్ బారిన పడకుండా చేయాలంటున్నారు వ్యాపారులు. ఇక కస్టమర్ల వాదన మరో రకంగా ఉంది. ప్లాస్టిక్ వాడకం అనేది చాలా కామన్ అయిపోయింది. అది ప్రమాదకరమని తెలిసి కూడా, ఎప్పుడో ఒకసారి ప్లాస్టిక్ పేపర్లలో తింటున్నాం కాబట్టి ఏం కాదులే అనే ఆలోచన వస్తుందంటున్నారు కస్టమర్లు..
































