బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా.. బుల్లితెరపై నేచురల్ యాక్టింగ్, మంచి స్కోప్ ఉన్న రోల్స్‌కు ప్రసిద్ధి చెందింది. తెరపై పెళ్లికూతురుగా ముస్తాబయిన ప్రతీసారి ఆడియెన్స్‌ను మైమరపిచింది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా.. బుల్లితెరపై నేచురల్ యాక్టింగ్, మంచి స్కోప్ ఉన్న రోల్స్‌కు ప్రసిద్ధి చెందింది. తెరపై పెళ్లికూతురుగా ముస్తాబయిన ప్రతీసారి ఆడియెన్స్‌ను మైమరపిచింది. ప్రజల హృదయాలను గెలుచుకుంది. అయితే.. శ్రద్ధా స్క్రీన్‌పై 10 సార్లు పెళ్లి చేసుకుందని మీకు తెలుసా? అవును, ఒకే షోలో పది సార్లు పెళ్లి సీన్లలో నటించిన శ్రద్ధా.. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది.
శ్రద్ధా ఆర్య.. బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకోవడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఏక్తా కపూర్. అసలు కొన్నేళ్ల ముందు వరకు కూడా బుల్లితెరపై తిరుగులేని మహారాణిలా నిలిచింది శ్రద్దా. అయితే.. ఇప్పుడు మాత్రం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. ఇండస్ట్రీకి శ్రద్దా దూరం అవడానికిి కారణం.. ఆమె తల్లి అవడం. నవంబర్ 2024లో కవలలు పుట్టిన తర్వాత శ్రద్ధా కెమెరాకు బ్రేక్ ఇచ్చింది.
తెరపై సింపుల్‌గా, ట్రెడిషనల్‌గా కనిపించే శ్రద్ధా నిజ జీవితంలో చాలా బోల్డ్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన ఫ్యాషన్ సెన్స్‌తో తరచుగా వార్తల్లో నిలుస్తుంది. కానీ శ్రద్ధా ఇప్పటివరకు తన కవల పిల్లల ముఖాలను చూపించలేదు
శ్రద్ధా లవ్ స్టోరీ ఏ రొమాంటిక్ సీరియల్‌కి తక్కువ కాదు. ఈ బ్యూటీ ఒకప్పుడు ఆలం మక్కర్‌తో ప్రేమలో మునిగితేలింది. వీరిద్దరు ‘నాచ్ బలియే 9’లో జంటగా పాల్గొన్నారు. అయితే, ఆ షో తర్వాత పలు కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత 2021లో ఇండియన్ నేవీ ఆఫీసర్ రాహుల్ నాగల్‌ను శ్రద్ధా పెళ్ళి చేసుకుంది.
శ్రద్ధా, రాహుల్ తరచుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఈ క్యూట్ కపుల్ తమ రొమాంటిక్, ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు ఎప్పటికప్పుడు పోస్టూ చేస్తూ.. నెటిజన్లను తమ వైపు చూసేలా చేసుకుంటారు. ఇక రాహుల్ .. శ్రద్ధా కెరీర్‌తో పాటు వ్యక్తిగత నిర్ణయాలలో ఆమెకు పూర్తిగా మద్దతు ఇస్తాడు.
ఇక ఒకే నటి పదే పదే పెళ్లి చేసుకోవడం టీవీలో చూడటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. కానీ శ్రద్ధా ఆర్య దానిని ఒక ట్రెండ్‌గా మార్చేసింది. అసలు ఆమె పెళ్లి కూతురిలా ముస్తాబయిందంటే అందరూ ఆమెను చూస్తూ మైమరచిపోవాల్సిందే
శ్రద్దా తన నటనా జీవితాన్ని తమిళ సినిమా’కల్వానిన్ కాదలి’తో ప్రారంభించింది. అయితే ‘మై లక్ష్మీ తేరే ఆంగన్ కి’, ‘కుండలి భాగ్య’ వంటి షోలు శ్రద్ధాకు తిరగులేని క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.
































