ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి చిక్కడపల్లి పోలీసులు ఇవాళ(సోమవారం) నోటీసులు ఇచ్చారు. రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు విచారణ కోసం రావాలని నోటీసులో పోలీసులు తెలిపారు.
అయితే బన్నీ మాత్రం తన లీగల్ టీంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కి సలాటలో ఒకరి మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు నుంచి నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను అల్లు అర్జున్ పొందారు.
ఊహించని పరిణామాలు..
అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేసి మరుసటి రోజు విడుదల చేశారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. అక్కడ చోటు చేసుకున్న ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందిందని, ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని రేవంత్ తెలిపారు. ఈ విషయం జరిగిన తర్వాత పోలీసులు వచ్చి అల్లు అర్జున్‌ను వెంటనే థియేటర్ నుంచి పంపించేలా చర్యలు తీసుకున్నారని.. కానీ అల్లు అర్జున్ మాత్రం తాను వెళ్లనని ససేమిరా చెప్పడంతో ఈఘటనలో మరో మలుపు తిరిగింది.
వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా…
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ తనకు రేవతి అనే మహిళ చనిపోయిన విషయాన్ని పోలీసులు అసలు చెప్పలేదని అన్నారు. ఈ విషయం మరుసటి రోజు మాత్రమే ఈ విషయం తెలిసిందని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తన విషయంలో అసత్యాలు చెబుతోందన్నారు. మరోవైపు కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రస్తావించడాన్ని కొందరు తప్పుపడుతుంటే.. మధ్యంతర బెయిల్‌పై ఉన్న వ్యక్తి ఈ కేసు విషయమై మీడియా సమావేశం నిర్వహించడాన్ని మరికొందరు తప్పుపడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయ రంగు..