ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 277 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 25, 2025వవ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
జిల్లాల వారిగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు ఇలా..
- కర్నూలు జిల్లాలో ఖాళీల సంఖ్య: 46
- నంద్యాల జిల్లాలో ఖాళీల సంఖ్య: 43
- అనంతపురం జిల్లాలో ఖాళీల సంఖ్య: 50
- శ్రీ సత్యసాయి జిల్లాలో ఖాళీల సంఖ్య: 34
- కడప జిల్లాలో ఖాళీల సంఖ్య: 60
- అన్నమయ్య జిల్లాలో ఖాళీల సంఖ్య: 44
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదోతరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐలో సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 8, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద అభ్యర్ధులు రూ.118 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
































