వాట్సాప్‌లో మరో అమేజింగ్‌ ఫీచర్‌ వస్తోంది..! ఇక ఫొటో ఆటోమేటిక్‌గా వీడియోగా

వాట్సాప్‌ త్వరలో చాట్స్‌, ఛానెల్స్‌లో మోషన్‌ ఫొటోలును షేర్‌ చేసేందుకు అనుమతి ఇవ్వబోతున్నది. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు కొన్ని సెకన్ల వీడియో, ఆడియో రికార్డింగ్‌తో సహా ఫొటోలను షేర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ కొత్త బీటా వెర్షన్‌లో కనిపించింది. అయితే, ఐఫోన్‌ యూజర్లు మాత్రం ఈ ఫీచర్‌ని లైవ్‌ ఫొటోల రూపంలో చూడొచ్చని వాట్సాప్‌ ట్రాకర్‌ తెలిపింది. WABetaInfo తెలిపిన వివరాల ప్రకారం.. పర్సనల్‌ చాట్స్‌, గ్రూప్‌ చాట్స్‌, ఛానెల్స్‌లో ఫొటోలను షేర్ చేసే ఫీచర్‌పై పని చేస్తున్నది. ఈ ఫీచర్‌ తొలుత ఆండ్రాయిడ్ 2.25.8.12 వాట్సాప్ బీటాలో కనిపించింది. ఇది ప్లే స్టోర్‌లోని బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉండగా.. త్వరలోనే ఆండ్రాయిడ్‌ యూజర్లు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మోషన్ ఫోటోలు అనేది కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఫీచర్‌ అందుబాటులో ఉన్నది.


దీన్ని కెమెరా యాప్‌ ద్వారా క్యాప్చర్‌ చేయొచ్చు. ఓ యూజర్‌ మోషన్‌ ఫొటో (పిక్సెల్‌ ఫోన్లలో టాప్‌ షాట్‌) క్లిక్‌ చేసినప్పుడు.. స్మార్ట్‌ఫోన్ ఫొటోతో పాటు చిన్న వీడియో, ఆడియోను కూడా రికార్డ్ చేస్తుంది. ఐఓఎస్‌లో ఈ ఫీచర్‌ని ‘లైవ్‌ ఫొటోస్‌’గా పిలుస్తారు. వాబీటాఇన్ఫో ఫీచర్‌ ఎనేబుల్‌ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసింది. ఇది మీడియా పికర్‌కు కొత్త ఐకాన్‌ జోడించినట్లుగా చూపించింది. ఈ ఐకాన్‌ పాప్‌-అప్‌ కార్డ్‌ కుడివైపు ఎగువన హెచ్‌డీ బటన్‌ పక్కనే కనిపించనున్నది. ఈ ఫీచర్‌ ఎనేబుల్‌ చేసిన తర్వాత యూజర్లు తమ ఆండ్రాయిడ్‌ స్మార్‌ఫోన్‌ల నుంచి మోషన్‌ ఫొటోలను ఇతర యూజర్లకు పంపుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అలాంటి ఫొటోలు వాట్సాప్‌లో స్టాటిక్‌ ఇమేజ్‌లుగా మాత్రమే షేర్‌ అయ్యాయి. కానీ, త్వరలో ఫీచర్‌ రానుండడంతో పూర్తిస్థాయిలో మోషన్‌ ఫొటోస్‌ (ఐఓఎస్‌లో లైవ్‌ ఫొటోస్‌) పంపడం సాధ్యం కానున్నది. మోషన్ ఫోటోలను ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే క్యాప్చర్ చేయగలిగినప్పటికీ, వాట్సాప్‌ ఈ ఫీచర్‌కు సపోర్ట్‌ చేయని ఇతర డివైజెస్‌లోనూ వీక్షించేందుకు అవకాశం ఇవ్వనున్నది.