విద్య, ఉద్యోగం.. ఆ తర్వాత కాసిన్ని డబ్బులు సంపాదించుకున్న తర్వాత వ్యాపారం. ఇదీ.. ఒకప్పుడు ఎక్కువ మంది ఆలోచన విధానం ఇలా ఉండేది. కానీ ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పు వచ్చింది.
చదువు పూర్తికాగానే వ్యాపారం చేయాలనే ఆసక్తి చాలా మందిలో పెరుగుతోంది. తాము వ్యాపారం చేస్తూ మరో నలుగురికి ఉపాధి కల్పించాలన్న కోరిక బలపడుతోంది.
ఇందులో భాగంగానే రకరకాల ఇన్నోవేటివ్ ఆలోచనలతో వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇప్పటికీ మనలో చాలా మంది వ్యాపారం అనగానే భయపడుతుంటారు. నష్టాలు వస్తే ఎలా అనే సందేహంలో ఉంటారు. అయితే మార్కెట్ అవసరాలకు, డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే నష్టం అనేది ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ప్లాస్టిక్ కవర్స్ బాగా ఉపయోగించేవారు. అయితే ఆ తర్వాత పర్యావరణ పరిరక్షణపై పెరుగుతోన్న అవగాహన నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్స్ స్థానంలో పేపర్ బ్యాగులను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా వరకు బ్రాండ్ కంపెనీలతో పాటు, సాధారణ దుకాణాల్లో కూడా ఇలాంటి బ్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాగుల తయారీని మీ వ్యాపార అస్త్రంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు.
పేపర్ బ్యాగ్ తయారీ పరిశ్రమను ప్రారంభించేందుకు మూడు మిషన్స్ కావాల్సి ఉంటుంది. వీటిలో ఒకటి.. పేపేర్ బ్యాగ్ మేకింగ్ మిషన్. ఇందులో విత్ ప్రింట్ కూడా ఉంటుంది. కస్టమర్స్ అవసరాలకు అనుగుణంగా ప్రింట్ చేయొచ్చు. వీటి ప్రారంభ ధర రూ. 3 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక క్రేజింగ్ మిషన్‌తో పాటు హైలెట్ పంచ్ మిషన్ కావాల్సి ఉంటుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి 1500 చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ముద్ర లోన్ కూడా పొందొచ్చు. ఇక పేపర్ బ్యాగ్ తయారీకి అవసరమయ్యే ముడి సరుకు అవసరపడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 3 ఫేజ్ విద్యుత్ లైన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. తయారు చేసిన పేపర్ బ్యాగ్‌లను మీరు నేరుగా పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్లను స్వీకరించి నేరుగా అందజేయొచ్చు.
లాభాలు ఎలా ఉంటాయంటే..
సాధారణంగా ఒక కేజీ పేపర్ బ్యాగ్‌ల తయారీ రూ. 30 నుంచి రూ. 35 వరకు ఖర్చవుతుంది. వీటిని రూ. 40 నుంచి రూ. 60 వరకు విక్రయించుకోవచ్చు. ఈ మిషిన్స్ సహాయంతో రోజుకు 700 కిలోల పేపర్ బ్యాగులను తయారు చేయవచ్చు. అంటే సరాసరి కిలో పేపర్ బ్యాగులకు రూ. 20 లాభం వేసుకున్నా రోజుకు రూ. 14,000 విలువైన బ్యాగులను సిద్ధం చేయొచ్చు. ఇక మీరు ఏమేర మార్కెట్ చేసుకుంటారో దానిబట్టి మీ ఆధాయం ఉంటుంది. తక్కువలో తక్కువ రోజుకు రూ. 5 వేల పేపర్ బ్యాగ్స్‌ను విక్రయించినా.. నెలకు రూ. లక్షన్నర వరకు ఆదాయం పొందొచ్చు.