హైదరాబాద్‌లో ఫ్లాట్ కొని రూ.1.8 కోట్లు నష్టపోయిన ఎన్నారై దంపతులు

హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ అంటే పెట్టుబడిదారులు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు నగరం ఓ స్వర్గధామంలా కనిపిస్తూ ఉంటుంది ఇన్వెస్టర్లకు.


అవకాశం ఉన్న చోట పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలను ఆర్జించాలనుకుంటారు. ఇక విదేశాల్లో సెటిల్ అయినవారు అయితే భాగ్యనరగంలో పెట్టుబడులు పెట్టేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. విదేశాల్లో ఉండి హైదరాబాద్ నగరంలో ఓ ఫ్లాట్ కొనుక్కుని తరువాత అమ్మేస్తుంటారు. అయితే ఈ సమయంలో ఎన్నారై హైదరాబాద్ లో ఉన్నఫ్లాట్ అమ్మినప్పుడు లాభంతో అమ్ముతాడా లేక చివరికి నష్టంతో అతని అమ్మకం ముగుస్తుందా..ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

లాభం కేవలం 8,500 డాలర్లు మాత్రమే : విదేశాల్లో డాలర్లలో సంపాదించి.. హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టి భారీగా నష్టాల పాలయ్యామని ఎన్ఆర్ఐ దంపతులు చెబుతున్నారు. బిజినెస్ టుడ్ కథనం ప్రకారం.. ఎన్ఆర్ఐ దంపతులు 2010లో హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటే మంచి పెట్టుబడిగా మారి లాభాలు వస్తాయనుకున్నారు. అయితే చివరాఖరికి వారికి 15 ఏళ్ల తరువాత వచ్చిన లాభం కేవలం 8,500 డాలర్లు మాత్రమే.. అంటే సంవత్సరానికి కేవలం 0.5% రాబడి వచ్చింది. అది కూడా ద్రవ్యోల్బణం (inflation), రూపాయి విలువ క్షీణతను (currency depreciation) పరిగణలోకి తీసుకుంటే వారు లాభం కాదు కదా..నష్టాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని ముగించారు. ఈ పెట్టుబడితో వారు దాదాపు 2,10,000 డాలర్లు నష్టపోయామని లబోదిబోమంటున్నారు.

ఎన్నారై దంపతులు 2010లో నానక్‌రామ్‌గూడలోని మంత్రి సెలెస్టియాలో 3BHK అపార్ట్‌మెంట్‌ను రూ. 64 లక్షలకు కొనుగోలు చేశారు. వుడ్‌వర్క్ సహా మొత్తం రూ. 64.34 లక్షలు ఖర్చు అయ్యింది. దానికి తోడు అపార్ట్‌మెంట్ డెలివరీ ఆలస్యం కావడంతో 2019లో మాత్రమే అది వారికి చేరింది. అయితే వారు లాభాలు వస్తాయనే ఆశతో కొన్నాళ్లపాటు అమ్మకుండా అలాగే ఉంచారు. ఇక 2024లో ఆ ఫ్లాట్ ని వారు రూ. 90 లక్షలకు విక్రయించారు. వారికి నికరంగా అమ్మకాల నుంచి రూ. 84.9 లక్షలు వచ్చాయి. ఇక 5 సంవత్సరాల్లో వారికి 7.2 లక్షల రూపాయలు అద్దె రూపంలో వచ్చాయి. సో మొత్తంగా చూసుకుంటే.. వారికి 45% లాభం వచ్చినట్టే కనిపిస్తుంది.

రూపాయల నుంచి డాలర్లకు వెళ్లేసరికి కష్టకాలం :అయితే ఇది రూపాయల నుంచి డాలర్లకు వెళ్లేసరికి వారికి కష్టకాలం ఎదురయింది. 2010లో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 45 రూపాయలు ఉండగా అది 2024 నాటికి 85 రూపాయలకు పడిపోయింది. అంటే వారి 1,11,740 వేల డాలర్ల పెట్టుబడికి గరిష్టంగా 1,20,000 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. 15 ఏళ్లకు గరిష్టంగా 8,500 డాలర్ల లాభం వచ్చింది. ఈ మొత్తం యుఎస్ లో సగటు S&P 500 స్టాక్ ఇండెక్స్‌లో పెట్టుంటే.. ఆ డబ్బు మూడు రెట్లు అయ్యేది. US స్టాక్‌లను కొనుగోలు చేసి ఉంటే దాదాపు 1.8 కోట్లు చేతికి వచ్చేవి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టడం వల్ల కేవలం రూ. 7 లక్షలు మాత్రమే ఆదాయంగా తిరిగి వచ్చిందని వాపోతున్నారు.

ఫ్లాట్‌కు ఆశించిన డిమాండ్ లేదు : అద్దె రాబడి (rental yield) కేవలం 2.25% మాత్రమే రావడం, ప్రాపర్టీ విలువ పెరుగకపోవడం అన్నీ కలిసివచ్చి పెట్టుబడి నష్టంగా మారింది. ఐటీ కారిడార్‌లో ఉన్నా కూడా, ఆ ఫ్లాట్‌కు ఆశించిన డిమాండ్ రాలేదు. విక్రయించడానికి కూడా చాలా టైం పట్టింది – ఇది రియల్ ఎస్టేట్‌ లో లిక్విడిటీ సమస్యను చెబుతుంది.దీనిని బట్టి రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ‘సురక్షిత పెట్టుబడి’ అనుకుంటే తప్పే. డాలర్లలో లెక్కించుకుంటున్న ఎన్ఆర్ఐలకు ఇది పాఠంగా పలువురు చెబుతున్నారు. ఒక గురుగ్రామ్ మేనేజర్ కూడా తన పరిచయస్తుడు టియర్ II నగరంలో రూ.70 లక్షల ఫ్లాట్‌ను 2022లో కొన్నాడు, కానీ 2024లో రూ.75 లక్షలకు అమ్మినా, ఖర్చుల తర్వాత లాభం లేదని సోషల్ మీడియా వేదికగా వాపోయాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.