లెజెండ్ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) కు అత్యున్నత పురస్కారం రావాలని ఆకాక్షించారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). మే 28, విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు 101వ జయంతిని (NTR Birth Anniversary) పురస్కరించుకుని ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు చిరంజీవి (Chiranjeevi). ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను ‘భారతరత్న’ (Bharat Ratna) పురస్కారంతో గౌరవించాలని మరోమారు చిరంజీవి ఈ ట్వీట్‌లో పేర్కొనడం విశేషం. ఎందుకంటే, ఇంతకుముందు పలుమార్లు కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తనకు పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంలోనూ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించి, ఆయనకు ‘భారతరత్న’తో గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఎక్స్ వేదికగా..
‘‘కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావుగారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను..’’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు (Megastar Chiranjeevi post on NT Ramarao). చిరంజీవి చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవ అనే కాదు కానీ.. ఎప్పటి నుండో ఈ కోరిక తెలుగు తమ్ముళ్లకు మిగిలిపోయింది. మరి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందేమో చూడాలి..
కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024