Number Port: మీ నెంబర్ ని వేరే నెట్ వర్క్ కి పోర్ట్ చేంజ్ చేసే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి.

PORT : మీ మొబైల్ నెంబర్‌ను మరొక నెట్‌వర్క్‌కి మార్చాలనుకుంటున్నారా? మారే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!


మీ ప్రస్తుత నెట్‌వర్క్‌తో సంతృప్తి లేకపోతే, మంచి ఆప్షన్‌గా పోర్ట్ చేయాలనుకోవచ్చు. కానీ, మారే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు cross-check చేయాలి. ఒక నెట్‌వర్క్ నుండి మరొకదానికి మారే ముందు ఈ 5 టిప్స్ గమనించండి.

1. నెట్‌వర్క్ కవరేజ్ తనిఖీ చేయండి

పోర్ట్ చేసే ముందు, కొత్త నెట్‌వర్క్ మీ ప్రాంతంలో good coverage ఉందో లేదో తెలుసుకోండి. సిగ్నల్ బలంగా ఉంటే మాత్రమే హై-స్పీడ్ డేటా, క్లియర్ కాల్స్ పొందగలరు. రూరల్ ఏరియాల్లో కొన్నిచోట్ల సిగ్నల్ వీక్‌గా ఉండవచ్చు.

2. ప్లాన్స్ & బెనిఫిట్స్ ని కంపేర్ చేయండి

ప్రస్తుత నెట్‌వర్క్ మరియు కొత్త నెట్‌వర్క్ prepaid/postpaid ప్లాన్స్OTT సబ్‌స్క్రిప్షన్స్, అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా వంటి ప్రయోజనాలను పోల్చండి. కొత్త నెట్‌వర్క్ మీకు బెటర్ వాల్యూ ఇస్తేనే పోర్ట్ చేయండి.

3. పోర్టింగ్ టైమ్ ఎంత?

పోర్టింగ్ ప్రక్రియకు కొన్ని గంటల నుండి 7 రోజులు వరకు పట్టవచ్చు. ఈ సమయంలో మీరు తాత్కాలికంగా కనెక్టివిటీ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. పోర్టింగ్ పూర్తయ్యే వరకు మీ పాత సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచండి.

4. పెండింగ్ డ్యూస్ లేకుండా ఉండండి

పోర్ట్ చేయడానికి మీ నంబర్ కనీసం 90 రోజులు యాక్టివ్‌గా ఉండాలి. మీ ప్రస్తుత నెట్‌వర్క్‌లో no pending bills ఉండకూడదు. పోర్టింగ్ కోసం మీ ID proof (ఆధార్, పాన్) సిద్ధంగా ఉంచండి.

5. పోర్టింగ్ ఛార్జీస్ ఎంత?

సాధారణంగా పోర్టింగ్ కోసం ₹19 చెల్లించాలి. కానీ Airtel, Jio వంటి కంపెనీలు కొన్నిసార్లు free porting ఆఫర్‌లు ఇస్తాయి. పోర్టింగ్ పూర్తయ్యాక, కొత్త సిమ్ కార్డ్ ఇవ్వబడుతుంది మరియు కొన్ని గంటల్లోనే యాక్టివేట్ అవుతుంది.