Oats Side Effects In Telugu: ఓట్స్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఎక్కువే..! ఇలా తింటే మీ ఆరోగ్యానికి యమ డేంజర్!

www.mannamweb.com


ఓట్స్ ఆరోగ్యకరమైన ఆహారం. కానీ ఓట్స్ ఎక్కువగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్ అందరికీ మంచిది కాదంటున్నారు..

వాటి వల్ల తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయంటున్నారు. ఓట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ ఇది కొంతమందిలో గ్యాస్, ఉబ్బరానికి కూడా దారిస్తుందని చెబుతున్నారు. అలాగే, కొంతమందిలో కడుపు నొప్పి, మలబద్ధకానికి కారణం అవుతుంది. ఓట్స్‌ అతిగా తింటే కలిగే అనర్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఓట్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌గా తినే చాలా పోషకమైన ఆహారం. వోట్స్ ప్రధానంగా కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం. కానీ, కొంతమందిలో ఓట్స్ తినడం వల్ల దురద, వాపు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలు కలిగే అవకాశం ఉంది. సాధారణంగా, రోజుకు ఒక కప్పు ఓట్స్ తినడం సురక్షితం. ఓట్స్‌ను ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో కలిపి తినండి. ఫైబర్, ఇతర పోషకాలను అందిస్తుంది. ఓట్స్‌ను తయారు చేసేటప్పుడు కొవ్వు లేదా చక్కెరను వేసుకోవద్దు. ఇలా చేస్తే కేలరీల కంటెంట్‌ను పెంచుతుంది.

ఓట్స్ కొందరికి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఓట్స్ సాధారణంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయి. కొన్నిసార్లు కర్మాగారాల్లో వోట్స్ ప్రాసెస్ చేయబడినప్పుడు, వాటిని ఇతర గ్లూటెన్-కలిగిన ధాన్యాలతో కలుపుతారు. వాటిలోని గ్లూటెన్‌ను జీర్ణించుకోలేని వ్యక్తులకు సమస్యలను కలిగిస్తుంది.