నేటి యువత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. కొడితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతున్నారు. లేదా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. అయితే బిజినెస్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అంత చేశాక లాభాలొస్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ, అదృష్టం బాగాలేక నష్టాలు వస్తే లైఫ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం అయితే ఏ చింతా లేకుండా ఉండొచ్చు. టైమ్ కు జీతం, సెలవులు, ప్రభుత్వం కల్పించే వివిధ అలవెన్సులు, సౌకర్యాలతో లైఫ్ బిందాస్ గా గడిపేయొచ్చు. ప్రైవేట్ సెక్టార్ లో శాలరీలు ఎక్కువగా ఉన్నా జాబ్ ఎప్పుడు ఊడుతుందో తెలీదు.
గవర్నమెంట్ కొలువైతే జీతం తక్కవగా ఉన్నా సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ కొలువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చాలు లక్షల్లో పోటీపడుతుంటారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. మరి మీరు కూడా మంచి జీతంతో కూడిన జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. డిగ్రీ కూడా అవసరం లేకుండానే ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 35 వేల జీతం పొందొచ్చు. మరి ఈ పోస్టులకు అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 108 ఆఫీస్ అటెండెంట్-గ్రూప్ సీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఆన్‌లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్) నిర్వహిస్తారు. రెండవ దశలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.35,000 వరకు జీతం లభిస్తుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 21వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.nabard.org/ వెబ్‌సైట్ ను పరిశీలించాల్సి ఉంటుంది.