Tradition భార్యాభర్తకి ఎటువైపు ఉండాలో.. అలా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా..

భార్యాభర్తకి ఎటువైపు ఉండాలో.. అలా ఉండకపోతే ఏమవుతుందో తెలుసా..


మన దేశంలో చాలామంది ప్రజలు సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు.భార్యాభర్తలు ఇలా నిలబడాలో అనే దాని గురించి కూడా సంప్రదాయాలలో ఉంది. భర్తకి భార్య ఎప్పుడూ ఎడమవైపు మాత్రమే ఉండాలని శాస్త్రం చెబుతోంది.
ముఖ్యంగా దానధర్మాలు పూజలు నోములు చేసేటప్పుడు భర్తకు భార్య తప్పనిసరిగా ఎడమవైపు ఉండడమే ఉండడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని చాలామంది వేద పండితులు చెబుతారు.

సృష్టికి మూలకర్త అయిన బ్రహ్మదేవుడు ఒక మనిషిని సృష్టించేటప్పుడు తనలోని కుడి భాగాన్ని పురుషుడిగా, ఎడమ భాగాన్ని స్త్రీగా తీసుకొని ఆడా మగవారిని ఈ భూమిపై సృష్టించాడని పురాణాలలో ఉంది. శ్రీమహావిష్ణువు కూడా తన భార్య అయిన శ్రీ మహాలక్ష్మిని ఎడమ స్థానంలోనే పదిలంగా భద్రపరచాడని చెబుతారు. అందువల్లే నిజజీవితంలోనూ భర్తకు భార్య ఎప్పుడూ ఎడమవైపే ఉండాలని చెబుతూ ఉంటారు. సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు అర్చకులు కొన్ని సూచనలు చెబుతూ ఉంటారు. అయ్యవారి రూపాన్ని చూడాలి అంటే ఎడమ కన్ను మూసి కుడి కన్నుతో చూడమని చెబుతూ ఉంటారు.
అదే అమ్మవారిని చూడాలనుకుంటే కుడి కన్ను మూసి ఎడమ కన్నుతో చూడమని చెబుతూ ఉంటారు. దీనికి ఉన్న అర్థం ఏమిటంటే శరీరాన్ని రెండు భాగాలు చేస్తే కుడివైపు బలంగా ఉంటుంది. ఎడమ భాగం కుడివైపు కన్నా కాస్త బలహీనంగానే ఉంటుంది. కుడి వైపు ఉన్న ప్రతి భాగం ఎడమవైపు ప్రతి భాగం కన్నా ఎంతో కొంత బలంగానే ఉంటుంది. కుడి చేతికి ఉన్నంత బలం ఎడమ చేతికి ఉండదు. కుడి కన్ను కు ఉన్నంత దృష్టి ఎడమ కన్నుకు ఉండదు. కుడి సూర్యభాగం ఎడమ చంద్రభాగం అంటే కుడి వైపు సూర్య నాడి ఎడమవైపు చంద్రనాడి ఉంటుంది.ఆభరణాలు చేయించుకున్న వారు కూడా కుడివైపు సూర్యుడు బొమ్మను, ఎడమవైపు చంద్రుడి బొమ్మను ఆభరణంగా చేయించుకుంటూ ఉంటారు. పగలు సూర్య నాడి రాత్రి చంద్రనాడీ ప్రకాశంవంతంగా ఉంటుంది. అందుకే పగలు నిద్రించేటప్పుడు ఎడమవైపు తిరిగి రాత్రి నిద్రి నిద్రపోయేటప్పుడు కుడివైపు తిరిగి నిద్రపోవాలి.