ప్రస్తుత కాలంలో కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే ఎన్నో అవరోధాలను అధిగమించి సత్తా చాటాల్సి ఉంటుంది. ఒకప్పుడు సర్పంచ్ గా పని చేసిన సంతోషలక్ష్మి తన ప్రతిభతో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రశంసలు అందుకుంటున్నారు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నగరంపల్లి గ్రామంలో జన్మించిన కర్రి సంతోషలక్ష్మి ( Karri Santhoshlakshmi )న్యాయమూర్తిగా ఎంపికై ప్రశంసలు అందుకుంటున్నారు.
గ్రామంలో సర్పంచ్ గా సేవలు అందించి ప్రజల అభిమానాన్ని చూరగొన్న సంతోషలక్ష్మి ఆ తర్వాత న్యాయశాస్త్రం చదివారు. ఒకవైపు న్యాయశాస్త్రం చదువుతూనే మరోవైపు న్యాయమూర్తి కావాలనే ఆలోచనతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన సంతోషలక్ష్మి తాజాగా రిలీజైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఫలితాలలో సత్తా చాటారు. ఆమె సివిల్ జడ్జిగా ఎంపిక కావడంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
భర్త దువ్వాడ వెంకట్ కుమార్ చౌదరి( Duvvada Venkat Kumar Chaudhary ) ప్రోత్సాహం వల్లే కెరీర్ పరంగా సక్సెస్ దక్కిందని ఆమె పేర్కొన్నారు. ఈ తరానికి చెందిన ఎంతోమందికి ఆమె స్పూర్తిగా నిలిచారని చెప్పవచ్చు. సంతోషలక్ష్మి ఐదు సంవత్సరాల పాటు గ్రామానికి సర్పంచ్ గా సేవలు అందించారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సంతోషలక్ష్మి సక్సెస్ స్టోరి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
భవిష్యత్తులో సంతోషలక్ష్మి మరిన్ని విజయాలను సాధించాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంతోషలక్ష్మి టాలెంట్ కు సామాన్యులు సైతం ఫిదా అవుతున్నారు. చిన్న వయస్సులోనే జూనియర్ సివిల్ జడ్జిగా( Junior Civil Judge ) ఎంపికైన ఆమెను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సంతోషలక్ష్మిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఈ తరం విద్యార్థినులు సైతం ఎన్నో విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.