One plus: కస్టమర్లకు తిరిగి డబ్బు చెల్లిస్తున్న వన్‌ప్లస్‌.. కారణం ఇదే..

www.mannamweb.com


One plus: కస్టమర్లకు తిరిగి డబ్బు చెల్లిస్తున్న వన్‌ప్లస్‌.. కారణం ఏంటంటే..
స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లాష్‌ స్టోరేజీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించినందుకు గాను వన్‌ప్లస్‌ కస్టమర్లకు డబ్బులను తిరిగి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్చి 16వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని వన్‌ప్లస్‌ సీఈఓ తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్‌ లాంచింగ్ సమయంలో ఇందులో యూనివర్సల్‌ ఫ్లాష్‌…
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్ ఇటీవల వన్‌ప్లస్‌ 12ఆర్‌ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఎవరైతే వన్‌ప్లస్‌12ఆర్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేశారో వారికి పూర్తి డబ్బు తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ వన్‌ప్లస్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లాష్‌ స్టోరేజీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించినందుకు గాను వన్‌ప్లస్‌ కస్టమర్లకు డబ్బులను తిరిగి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్చి 16వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని వన్‌ప్లస్‌ సీఈఓ తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్‌ లాంచింగ్ సమయంలో ఇందులో యూనివర్సల్‌ ఫ్లాష్‌ స్టోరేజ్‌ 4.0 స్టోరేజీ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ విషయంపై వన్‌ప్లస్‌ కీలక ప్రకటన చేసింది.

వన్‌ప్లస్‌ ఆర్‌ హై స్టోరేజీ వేరియంట్‌ ఫోన్లు నిజానికి UFS 3.1 స్టోరేజ్‌తో వచ్చాయని, లాంచింగ్ సమయంలో తప్పుగా ప్రకటించామని తేల్చి చెప్పంది. దీంతో వన్‌ప్లస్‌ ఆర్‌ 256జీబీ వేరియంట్‌ను కొనుగోలు చేసినవారికి పూర్తి మొత్తాన్ని రిఫండ్‌ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. వన్‌ప్లస్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని వన్‌ప్లస్‌ సీఓఓ కిండర్‌ లియు సూచించారు.
ఇక వన్‌ప్లస్‌ 12 ఆర్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడీయో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ధర విషయానికొస్తే.. 16 జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.45,999గా నిర్ణయించారు.