ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ పెరిగిపోతుంది. రోజు రోజుకి చాలా డెవలప్ అయిపోతుంది. కొత్త కొత్త కంపెనీలు కుప్పలు కుప్పలుగా మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. వాహనదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు రకరకాల ఫీచర్లతో సూపర్ బైక్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా యూత్ ని ఇంప్రెస్ చేసేందుకు చాలా కంపెనీలు స్టైలిష్ లుక్ లని మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. అందులో ఫేమస్ టూ వీలర్ కంపెనీ టీవీఎస్ ఒకటి. టీవీఎస్ అంటేనే టాప్ బ్రాండ్. ఎన్నో దశాబ్దాలుగా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని టూ వీలర్ కంపెనీగా దూసుకుపోతుంది. ఎన్నో నాణ్యమైన సూపర్ బైక్ లని అందిస్తుంది. వినియోగదరులను పెంచుకుంటూ పోతుంది. మార్కెట్లో దీని రూటే సపరేటు. టీవీఎస్ బైక్ లని జనాలు ఇష్టపడటానికి కారణం అందుబాటు ధర. తక్కువ ధరలో అదిరిపోయే బైక్ లని ప్రవేశ పెడుతుంది. అలా ఇప్పటికే ఎన్నో మోడళ్లను రిలీజ్ చేసింది టీవీఎస్ కంపెనీ. ఇక తాజాగా మరొక బైక్ ను ఇంట్రడ్యూస్ చేసింది. ఆ బైక్ ఏంటి? దాని ఫీచర్స్ ఏంటి ? దాని ధర ఎంత? పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తాజాగా టీవీఎస్ కంపెనీ తన అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. నిజానికి ఇంతకు ముందే ఈ బైక్ రిలీజ్ అయ్యింది. అదిరిపోయే కలర్ ఆప్షన్లలో సేల్ అవుతుంది. మార్కెట్లో ఈ బైక్ చాలా స్పెషల్. దీనికి సూపర్ డిమాండ్ ఉంది. అందువల్ల కంపెనీ మరొక కొత్త కలర్లో దీనిని లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సూపర్ బైక్ ను ఆల్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో కొనుక్కోవచ్చు. దీంతో మొత్తం ఏడు కలర్స్ లో ఈ TVS Radeon బైక్ మార్కెట్లోకి వస్తుంది. ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో ఉంటుంది. అందులో బేస్ వేరియంట్ ధర చాలా తక్కువ. బేస్ వేరియంట్ కేవలం రూ.59,880 (ఎక్స్ షోరూమ్) ధరకే వస్తుంది. ఇక మిడ్ రేంజ్ డీజీ డ్రమ్ వేరియంట్ అయితే రూ.77,394 (ఎక్స్ షోరూమ్) ధరకే వస్తుంది. అలాగే టాప్ రేంజ్ డీజీ డిస్క్ వేరియంట్ అయితే రూ.81,394 (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. మార్కెట్లో మంచి బైక్ కావాలంటే దాదాపు లక్ష రూపాయలైనా చెల్లించుకోవాల్సిందే. కానీ ఈ బైక్ ని కేవలం 80 వేల లోపు మాత్రమే సొంతం చేసుకోవచ్చు. ధర తక్కువగా ఉంది ఫీచర్లు కూడా తక్కువగా ఉంటాయేమో అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఈ బైక్ లో సూపర్ ఫీచర్లు ఉంటాయి. ఆ సూపర్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
TVS Radeon లో అదిరిపోయే ఎలిమెంట్స్ ఉన్నాయి. దీనికి ఎల్సీడీ స్క్రీన్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఫిక్స్ చేశారు. ఇంకో అదిరిపోయే ఎలిమెంట్ ఏంటంటే.. ఈ బైక్ లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (cbs) ఉంటుంది. ఈ సూపర్ ఫీచర్ కారణంగా బైక్ కి సంబంధించిన బ్రేకింగ్ సిస్టమ్స్ కరెక్ట్ గా పనిచేస్తాయి. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి ఫీచర్లు ఒక బ్రాండెడ్ బైక్ లో రావడం కష్టం. కానీ మనం ఈ సరికొత్త బైక్ లోనే వీటని చూడవచ్చు. ఈ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే.. దీనికి 109.7 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ చాలా పవర్ ఫుల్. ఇది 8 పిఎస్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక దీని మైలేజ్ విషయానికి వస్తే కచ్చితంగా వావ్ అనాల్సిందే. ఎందుకంటే ఈ బైక్ లీటర్ కు 73.68 కి.మీ దాకా మైలేజీని ఇస్తుంది. అంతేగాక ఈ బైక్ లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్లు కూడా ఉంటాయి. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునేవారికి నిజంగా ఈ బైక్ సూపర్ ఆప్షన్.