సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోన్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు.
ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు. ఇదే సమయంలో తనని ట్రోల్ చేసి వారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానం ఇస్తున్నారు. పవన్‌తో విడాకులపై ఆయన అభిమానులు పలు మార్లు రేణు దేశాయ్‌ను ఇబ్బంది పెట్టడం జరిగింది.
పవన్‌కు విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసు ఉన్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరు చేసిన కామెంట్‌పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ను నేను వదిలేయలేదని. ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెప్పి వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు.
ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే.. రేణు దేశాయ్ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఆమె తన తర్వాత సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నానంటూ తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. అయితే ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం ఆమె వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. త్వరలోనే తాను సన్యాసం తీసుంకుంటానని చెప్పి అభిమానులకు షాకిచ్చింది. ఒక సంవత్సరం మాత్రమే ఉంటానని, ఆ తర్వాత సన్యాసం తీసుకోని ఆశ్రమానికి వెళ్లిపోతానని రేణు దేశాయ్ వెల్లడించింది. అయితే ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కారణం మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
































