ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ కేవలం 680 రూపాయలకే భారత్‌లో అందుబాటులో ఉంది. బ్రాండ్ ఛాంపియన్ లిస్ట్ 2025లో ఈ విస్కీ చోటు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆల్కాహాల్ బ్రాండ్స్ వేలంలో అమ్ముడైపోవడం చూసే ఉంటారు.
అయితే భారత్‌కు చెందిన ఓ ఆల్కాహాల్ బ్రాండ్… ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది.
2025లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైపోయిన విస్కీ బ్రాండ్స్ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో భారత దేశానికి చెందిన McDowell’s అనే విస్కీ చోటు దక్కించుకుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ విస్కీ బ్రాండ్…భారత్‌లో ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. అంతే కాదు ఈ విస్కీ అంత ఖరీదైనదేమి కాదు, మన దేశంలోని వైన్స్‌లో ఈజీగా దొరుకుతుంది. ఆల్కాహాల్ తాగే అలవాటు ఉన్న చాలా మందికి ఈ విస్కీ తెలిసే ఉంటుంది.
The Spirits Business యొక్క Brand Champions 2025 రిపోర్ట్ ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టాప్ 5 అల్కాహాల్ బ్రాండ్లలో 4 ఇండియాకు చెందిన విస్కీ బ్రాండ్స్ ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విస్కీ బ్రాండ్ ఇదే…
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన విస్కీ బ్రాండ్‌గా భారత్‌కు చెందిన McDowell’s No. 1 Luxury Premium Whisky చోటు దక్కించుకుంది. ఈ బ్రాండ్ విస్కీ 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 32.2 మిలియన్ కేసెస్ అమ్ముడయ్యాయి. ఎలాంటి ప్రత్యేకమైన మార్కెటింగ్ లేకుండానే ఏకంగా గతేడాది 2.6 శాతం పెరుగుదల కనిపించింది.
McDowell’s No. 1 విస్కీని 1968 నుండి అందుబాటులోకి వచ్చింది. అయితే చాలా ఏళ్లుగా భారతీయులకు ఈ బ్రాండ్ ఎంతో సుపరిచితం. ఎన్నో తరాలుగా మద్యం ప్రియులు ఈ విస్కీని ఇష్టంగా తాగుతున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్, బార్లు, వైన్స్ ఇలా ప్రతి చోట ఈ విస్కీ ఈజీగా దొరుకుతుంది. సరసమైన ధరకే అందుబాటులో ఉన్నటువంటి ఈ విస్కీ బ్రాండ్, ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో ఇష్టమైన విస్కీ బ్రాండ్‌గా మారింది, దీంతో సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి.
కేవలం 680 రూపాయలేనా?
అవును, మీరు విన్నది నిజమే, ప్రపంచంలోనే టాప్ 1 విస్కీగా నిలిచిన McDowell’s No. 1 విస్కీ ధర రూ.680 మాత్రమే. అయితే ఈ ధర రాష్ట్రాన్ని బట్టి మారుతుంటుంది. ఢిల్లీలో రూ.420, బెంగళూరులో రూ.960, గోవాలో సుమారుగా 300 ఉంటుంది.
Disclaimer: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.
































