ఆ తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తాం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్(Telangana Cabinet) సమావేశం జరిగింది.


సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్‌లో నిర్ణయించినట్లు ప్రకటించారు. ‘దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో కులగణన పూర్తి చేశాం. బీసీలకు రాజకీయంగా 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతంలో హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించాం. త్వరలోనే ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని సవరిస్తాం’ అని వెల్లడించారు.

కేబినెట్ నిర్ణయాలు :

= పంచాయతీ రాజ్ చట్ట సవరణకు ఆమోదం

= బీసీలకు రాజకీయంగా 42శాతం రిజర్వేషన్లు

= రెండు ప్రయివేట్ యూనివర్సిటీలకు అనుమతి

= సెయింట్ మేరీ, అమిటీ వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్

= తెలంగాణకు 50శాతం సీట్లు ఇవ్వాలని ఒప్పందం

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.