ఓటీటీ యాడ్స్‌… బాబోయ్‌ మా వల్ల కావట్లేదు

కప్పుడు టీవీల్లో సినిమాలు, సీరియల్స్‌, షో లు చూసే సమయంలో మధ్యలో యాడ్స్ వస్తే విసుగు అనిపించేది. కానీ పిల్లలు ఆ యాడ్స్‌ను ఎంజాయ్ చేయడం, యాడ్స్‌లో వచ్చిన మ్యూజిక్‌ను ఎంజాయ్‌ చేయడం చూశాం.


టీవీల్లో వచ్చే యాడ్స్‌ నుంచి తప్పించుకున్నాం అని ఓటీటీ స్ట్రీమింగ్‌ చేస్తున్న వారికి ఆ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రైమ్‌ తీసుకున్నా, సబ్‌స్క్రప్షన్‌ తీసుకున్నా కూడా యాడ్స్‌ మాత్రం వదలడం లేదు. ప్రతి ఓటీటీలోనూ యాడ్స్ వస్తూనే ఉన్నాయి. యాడ్స్‌ లేకుండా కంటెంట్‌ చూడాలి అంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దాంతో దాదాపు అందరు మద్యతరగతి వారు యాడ్స్‌ ఉన్న ప్లాన్‌ను మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఓటీటీల్లో వచ్చే యాడ్స్ పెద్ద తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి. చాలా సమయం ఆ యాడ్స్‌ కి పోతుంటే, అశ్లీలత కూడా ఎక్కువ అవుతోంది.

జియో హాట్‌స్టార్‌లో యాడ్స్‌…

ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్‌లో ఒక సినిమాను స్ట్రీమింగ్ చేయాలి అంటే దాదాపుగా ఐదు ఆరు సార్లు యాడ్‌ను చూడాల్సిందే. వచ్చినప్పుడల్లా మూడు నాలుగు యాడ్స్ కంటిన్యూగా దాదాపు రెండు నిమిషాలు వస్తున్నాయి. ఓటీటీ యాడ్స్ అనగానే సెన్సార్‌ ఉండవు కనుక కాస్త అశ్లీలంగానే ఉంటాయి. ఆ యాడ్స్ పిల్లలపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ ఓటీటీ కంటెంట్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ZEE5 లో ఈ మధ్య ఏ సినిమా చూడాలి అనుకున్నా కచ్చితంగా కండోమ్‌ యాడ్స్ వస్తున్నాయి. పలు కంపెనీలకు సంబంధించిన కండోమ్ యాడ్స్ ను జీ5 వారు సినిమాల మధ్య స్ట్రీమింగ్‌ చేస్తూ విసుగు పుట్టిస్తున్నారు. సాధారణ యాడ్స్ చూడటమే కష్టం అంటే పిల్లలతో కలిసి సినిమా చూసే సమయంలో కండోమ్‌ యాడ్స్ వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

జీ5 లో వచ్చే కండోమ్ యాడ్స్ వల్ల…

భాష ఏదైనా జీ5 వారు సినిమా మధ్య లో కండోమ్‌ యాడ్‌ను స్ట్రీమింగ్‌ చేయడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కంటెంట్‌ను స్ట్రీమింగ్‌ చేసేప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వచ్చి పోతుందా అంటే అది లేదు, సినిమా మధ్యలో, సిరీస్‌ మధ్యలో చాలా సార్లు వస్తూనే ఉంటుంది. వచ్చిన ప్రతిసారి కండోమ్‌ యాడ్‌ ఉంటే ప్రేక్షకులు ఎలా చూస్తారు అంటూ సగటు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీ5 లో ఉన్న ఈ పరిస్థితి ఇతర ఓటీటీ ల్లోనూ ఉంది. అందుకే దీన్ని చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ద్వారా జీ5 కి ఈ విషయమై ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఏకంగా కేంద్ర ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ కు సైతం ట్యాగ్‌ చేసి సోషల్ మీడియా ద్వారా కొందరు జీ5 పై ఫిర్యాదు చేయడం జరిగింది.

ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలో…

ఫ్యామిలీ ఆడియన్స్ చూసే కంటెంట్‌ లో కండోమ్‌ యాడ్స్ ఉండటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. పిల్లలు ఎక్కువగా చూస్తారు కనుక కండోమ్‌ యాడ్స్ విషయంలో ఇకపై అయినా ఓటీటీ వారు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మద్యతరగతి ప్రేక్షకులు థియేటర్‌లకు దూరం అయ్యారు. వారు ఓటీటీ ద్వారా సినిమాలను చూసి ఆనందించాలని భావిస్తూ ఉంటే, ఇలాంటి యాడ్స్ రావడం వల్ల ప్రేక్షకులు ఆ ఓటీటీ కంటెంట్‌ ను సైతం బహిష్కరించే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శృతి మించి అశృలత ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే ప్రేక్షకులు మెల్ల మెల్లగా జీ5 తో పాటు ఇతర ఓటీటీ ల్లో ఏవి అయితే అశ్లీల వీడియోలను, అశ్లీల యాడ్స్ ను ప్రదర్శిస్తున్నారో వాటిని చూడటం మానేసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.