లోక నాయకుడు కమల్ హాసన్- సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు 2’. దాదాపు 28 ఏళ్ల (1996)క్రితం వచ్చిన సూపర్ హిట్ భారతీయుడుకు ఇది సీక్వెల్.
అయితే ఆ మ్యాజిక్ ను కొనసాగించడంలో భారతీయుడు 2 ఘోరంగా విఫలమైంది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ తారాగణం, ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఉన్నప్పటికీ ఔట్ డేటెస్ కథా, కథనాలు కు మైనస్ గా మారాయని రివ్యూలు వచ్చేశాయి. తమిళంలో ఈ కు ఒక మోస్తరు గానే వసూళ్లు వచ్చాయి. అయితే తెలుగుతో సహా ఇతర భాషల్లోనూ భారతీయుడు 2 భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్లాఫ్ టాక్ రావడంతో చాలామంది ఓటీటీలో ఈ ను చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు వారి కోసమే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. భారతీయుడు 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 9 నుంచి కమల్ ను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు కొన్ని రోజుల రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంటే ఇవాళ్టి అర్ధ రాత్రి నుంచే భారతీయుడు 2 ఓటీటీలో ప్రత్యక్షం కానుందన్నమాట. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ భారతీయుడు 2 స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.
భారతీయుడు 2 లో సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ కు స్వరాలు సమకూర్చారు.ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ సుమారు రూ. 250 కోట్లతో భారతీయుడు 2 ను నిర్మించారని సమాచారం. అయితే ఓవరాల్ గా ఈ కేవలం రూ. 130 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక భారతీయుడు 2 ను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 న ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు వచ్చాయి. అయితే థియేటర్లలో నెగెటివ్ టాక్ రావడంతో ఒక వారం రోజులు ముందుగానే కమల్ ను ఓటీటీలోకి తీసుకురానున్నారు. మరి థియేటర్లలో భారతీయుడు 2 ను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి కమల్ నటనను ఆస్వాదించండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..