ఎఫ్‌డీపై ఓవర్‌డ్రాఫ్ట్‌ – ప్రయోజనాలు, వడ్డీ రేట్లు

తమ పెట్టుబడులపై స్థిరత్వం, భద్రత కావాలనుకునే వారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఒక ప్రసిద్ధ పొదుపు ఎంపిక. ఎఫ్‌డీ మీకు తక్షణ లిక్విడిటీ, ఆర్థిక సౌలభ్యాన్ని అందించగల విలువైన ఆస్తి వలె అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఎఫ్‌డీని ఉపసంహరించకుండా దీనిపై లోన్‌(ఓవర్‌డ్రాఫ్ట్‌) కూడా తీసుకోవచ్చు. ఇది బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించే సౌకర్యం. ఇది మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ విలువకు తగ్గట్టుగా రుణం తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. బ్యాంకులు, తీసుకున్న మొత్తంపై వడ్డీని వసూలుజేస్తాయి. అయితే, ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితి FD విలువ, ఇతర అంశాల ఆధారంగా ఉంటుంది. ODపై వివిధ బ్యాంకులు వాసులుజేసే రేట్లను చూద్దాం.