బుకింగ్స్‌లో మాత్రం హైదరాబాద్ మొదటి స్థానం

www.mannamweb.com


మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. ఏడాది ఆఖరులో ఓయో ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఓయో బుకింగ్‌లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది.ట్రావెలోపీడియా 2024′ నివేదిక ప్రకారం..

ఈ సంవత్సరం భారతదేశంలో మతపరమైన పర్యాటకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూరీ, వారణాసి, హరిద్వార్‌ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్‌లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది.ఇదిలా ఉండగా.. బుకింగ్స్‌లో మాత్రం హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.

తర్వాత.. బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ ప్రయాణించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ప్రయాణ దృశ్యాలకు పర్యాటక రంగాలకు అనువుగా ఉన్నాయి.

పాట్నా, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న నగరాల్లో ఈ ఏడాది బుకింగ్‌లు 48 శాతం వరకు పెరిగాయి. ‘ఈ సంవత్సరం సెలవుల సమయంలో ప్రయాణ కార్యకలాపాలు కూడా పెరిగాయని ఓయో తెలిపింది. గోవా, పుదుచ్చేరి, మైసూర్ వంటి ఎవర్‌గ్రీన్ గమ్యస్థానాల తర్వాత జైపూర్ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. అయితే ముంబైలో బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి.

ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీసెస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్‌బోలే మాట్లాడుతూ.. ఈ ఏడాది పర్యాటక రంగా అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. పని ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది మానసిక ప్రశాంతత కోసం తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లినట్లు తెలిపారు.2012లో స్థాపించబడిన ఓయో.. భారత స్టార్టప్‌ కంపెనీల్లో ఓ సంచలనం సృష్టించింది.

ఇప్పుడు ఏ చిన్న పట్టణానికి వెళ్లినా ఓయో రూమ్స్‌ దర్శనమిస్తున్నాయి. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు రాత్రి పూట ఒకవేళ బస చేయాల్సి వస్తే టక్కున గుర్తొచ్చేదీ ఓయోనే. అనతికాలంలోనే అంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ స్టార్టప్‌. దీని వెనుక ఓ యువకుడి కృషి, పట్టుదల దాగి ఉన్నాయి. అతడే రితేశ్‌ అగర్వాల్‌. ఈయనే ప్రస్తుతం ఓయో సీఈఓగా కొనసాగుతున్నరు.