న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ కైవసం చేసుకుంది. హామిల్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-0 ఆధిక్యం సంపాదించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 194 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ తరఫున బాబర్ అజామ్, ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీ చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. అయితే వీరిద్దరూ నాలుగు బౌండరీ సిక్సర్లు బాది ప్రేక్షకులను అలరించారు. అదే సమయంలో మ్యాచ్‌కు ఉపయోగించిన బంతి చోరికి గురైన సంఘటన కూడా చోటుచేసుకుంది. దీంతో కాసేపు ఆట నిలిచిపోయింది. నిజానికి న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ తొలి మ్యాచ్‌లానే వర్షం కురిసింది. ఫిన్ అలెన్ 74 పరుగుల సహకారంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. అయితే బాబర్, ఫఖర్ జమాన్ ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఓ వైపు బాబర్ బౌండరీలు కొడుతుంటే, మరోవైపు ఫఖర్ భారీ పెద్ద సిక్సర్లు బాదాడు. అయితే పాకిస్థాన్ ఇన్నింగ్స్ జరుగుతుండగా.. ఆట చూసేందుకు మైదానానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు బంతిని దొంగిలించి పారిపోయాడు.
న్యూజిలాండ్ పేసర్ బెన్ సియర్స్ వేసిన 6వ ఓవర్లో ఫఖర్ జమాన్ భారీ సిక్సర్ బాదాడు. బంతి స్టేడియం నుంచి నేరుగా వెళ్లి రోడ్డుపై పడింది ఇది చూసిన కొందరు అభిమానులు బంతిని తీసుకుని పరుగులు తీశారు. ఈ సమయంలో, ఒక ప్రేక్షకుడు బంతిని తీసుకొని మైదానంలోకి విసిరేయకుండా రోడ్డుపై పరుగెత్తడం ప్రారంభించాడు. అతను తిరిగి వస్తాడని అందరూ ఎదురుచూశారు. కానీ బంతిని అందుకున్న వ్యక్తి మళ్లీ మైదానంలోకి రాలేదు. దీంతో మైదానంలో ఉన్న అంపైర్ మరో బంతిని తీసుకుని మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించాడు. ఇప్పుడు ప్రేక్షకుడు బంతిని దొంగిలించి పరుగు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
సిక్సర్లతో రెచ్చిపోయిన ఫఖర్ జమాన్..
Six of the day 🙌🔥#FakharZaman
#木村拓哉 #佐々木久美 #ワイドナ pic.twitter.com/GfNDtDhsMn
— ᵂᵃˢᵉᵉᵐ ᴿᵃʰⁱᵐᵒᵒⁿ 🇵🇰 (@WaseemRahim00n) January 14, 2024