పాన్ ఇండియా వేదికపై పరువు పోగుట్టుకున్న అల్లు అర్జున్.. మరీ ఇంత ఘోరమా

www.mannamweb.com


అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా ఎంతో నెగిటివిటీ, ఎన్నో కాంట్రవర్సీల మధ్య విడుదలయ్యింది.

అయినా కూడా విడుదలయిన వారం రోజుల్లోనే రూ.1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. చాలామంది ప్రేక్షకులు.. ‘పుష్ప 2’ యావరేజ్ మూవీ అని కామెంట్స్ చేస్తున్నా కూడా ఈ సినిమా థియేట్రికల్ రన్ విషయంలో తగ్గేదే లే అనిపించుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా కలిసి ‘పుష్ప 2’ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఢిల్లీలో థాంక్యూ ఇండియా పేరుతో ఒక సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. మరోసారి తన పరువు పోకూడదని ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అల్లు అర్జున్.

మళ్లీ అలా జరగకూడదు

‘పుష్ప 2’ విడుదలయిన రెండు రోజుల్లోనే థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయని హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ సక్సెస్ మీట్‌ను అల్లు అర్జున్ అస్సలు ప్రిపేర్ అయ్యి రాలేదని తను స్టేజ్ ఎక్కి స్పీచ్ మొదలుపెట్టగానే అందరికీ అర్థమయిపోయింది. తెలంగాణలో టికెట్ ధరలు పెంచడానికి అనుమతించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తూ రేవంత్ రెడ్డి పేరునే మర్చిపోయాడు బన్నీ. ఆ తర్వాత పలువురు మంత్రుల పేర్లు మర్చిపోయాడు. మర్చిపోయినా కూడా అప్పటికప్పుడు స్టేజ్‌పైనే బాగానే కవర్ చేశాడు. థాంక్యూ ఇండియా సక్సెస్ మీట్‌లో అలా జరగకూడదని అన్ని విషయాలు ఒక పేపర్‌పై రాసుకొచ్చాడు అల్లు అర్జున్.

థాంక్యూ ఇండియా సక్సెస్ మీట్‌లో స్టేజ్ ఎక్కగానే తడబడ్డాడు అల్లు అర్జున్. ఆ జనాలను చూసి ఎక్కువ సంతోషంగా ఉందని కవర్ చేశాడు. ”పుష్ప 2పై మీరు చూపిస్తుంది లవ్ కాదు.. వైల్డ్ లవ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్. ఈసారి ఫైర్ కూడా కాదు. వైల్డ్ ఫైర్. పుష్పను నేషనల్ అనుకున్నావా.. ఈసారి ఇంటర్నేషనల్. ఈ సక్సెస్‌ను సాధ్యం చేసిన ఒక మనిషికి ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. ఇప్పుడు తనే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాడు. తనను నేను ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాను. ఇది తన సక్సెస్. తను మరెవరో కాదు.. మా దర్శకుడు బండి సుకుమార్ రెడ్డి” అని గర్వంగా చెప్పాడు అల్లు అర్జున్.

పేపర్ చూస్తూ థాంక్యూ

”పుష్పకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు హిందీ ఇండస్ట్రీకి చాలా థాంక్యూ. దాంతో పాటు అన్ని భాషా పరిశ్రమలకు థాంక్యూ. ప్రతీ రాష్ట్రంలోని మీడియా, ప్రభుత్వం, పోలీసులకు కూడా ఈ సినిమాను సపోర్ట్ చేసినందుకు థాంక్యూ” అంటూ అందరికీ థాంక్యూ చెప్తూనే ఉన్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). అది కూడా పేపర్‌లో చూస్తూనే ఒకరి తర్వాత మరొకరి పేర్లు చదువుతూ థాంక్యూ చెప్పాడు. ఒక పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో.. పేపర్ చూస్తూ అందరికీ థాంక్యూ చెప్పడమేంటి అని అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. తన పరువు తానే పోగొట్టుకున్నాడని నెటిజన్లు అంటున్నారు.